Connect with us

Donation

Dallas NRI వెంకట్ జిల్లెళ్లమూడి దాతగా సన్నకారు రైతులకు ట్రాక్టర్ అందజేత: TANA Foundation

Published

on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా (Prakasam District), తిమ్మాపురం గ్రామ పేద రైతులకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ తరపున ఉచితంగా ట్రాక్టర్ అందజేశారు. జనవరి 14, 2024న గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో రైతులకు అందించారు.

ఈ మహీంద్ర ట్రాక్టర్ (Mahindra Tractor) దాత టెక్సస్ రాష్ట్రం, డల్లాస్ వాసి వెంకట్ జిల్లెళ్లమూడి (Venkat Jillellamudi). ఇంతకు మునుపు కూడా తన గ్రామానికి ఎప్పటికప్పుడు పలు ప్రజోపయోగ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు వెంకట్ జిల్లెళ్లమూడి.

భోగి పండుగ సందర్భంగా సన్నకారు, పేద రైతుల సహాయార్థం తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ (Venkata Ramana Yarlagadda) చేతులమీదుగా రైతులకు ట్రాక్టర్ అందచేయడం జరిగింది. ఈ ట్రాక్టరు తిమ్మాయపాలెం చుట్టు ప్రక్కల ఉన్న పేద రైతులకు ఉచితంగా వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడనున్నది.

ఈ సందర్భంగా తానా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ మాట్లాడుతూ.. తానా ఫౌండేషన్ తరపున వెంకట్ జిల్లెళ్లమూడి (Venkat Jillellamudi) ని హృదయ పూర్వకంగా అభినందిస్తున్నామన్నారు. ఇటువంటి దాతల వితరణ ద్వారా తానా ఫౌండేషన్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించగలుగుతుంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన తానా ఫౌండేషన్ (TANA Foundation) ట్రస్టీ లకు, తానా సభ్యులకు, తానా ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు కు, దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. పండగపూట తమ గ్రామానికి విచ్చేసి ట్రాక్టర్ అందించిన తానా ఫౌండేషన్ ఛైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ ని, అలాగే తానా నాయకులను గ్రామస్తులు అభినందించారు.

error: NRI2NRI.COM copyright content is protected