Qatar: గత 20 సంవత్సరాలుగా ఖతార్ (Qatar) లో నివసిస్తూ సమాజ సేవలో విశేష సేవలు అందిస్తున్న ప్రముఖ కమ్యూనిటీ నాయకుడు మరియు హ్యూమానిటేరియన్ విశాఖ (Visakhapatnam) వాసి శ్రీ వెంకప్ప భాగవతుల (Venkappa Bhagavatula) గారికి, ఖతార్‌తో పాటు అంతర్జాతీయ స్థాయిలో చేసిన సేవల గుర్తింపుగా ఇండోర్, మధ్యప్రదేశ్ లో జరిగిన GIO (గ్లోబల్ ఇండియన్ ఆర్గనైజేషన్) నాల్గవ అంతర్జాతీయ మహాసభలో..
“ఉత్తమ సేవా పురస్కారం (Best Philanthropy Award)” ప్రధానం చేయబడింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం, ఆయన సామాజిక సేవ పట్ల అంకితభావం, కరుణ మరియు ప్రభావవంతమైన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా లభించింది. పురస్కారం స్వీకరించిన సందర్భంగా తన హృదయపూర్వక కృతజ్ఞతలను వ్యక్తం చేస్తూ..
శ్రీ వెంకప్ప భాగవతుల (Venkappa Bhagavatula) గారు, “ఈ అవార్డు తన వ్యక్తిగత కృషికే కాకుండా, ఈ ప్రయాణంలో నాతో పాటు నడిచిన సహచరులు, భాగస్వాములు, మార్గదర్శకులు, మిత్రులు మరియు సమాజ సభ్యుల సమిష్టి అంకితభావానికి గుర్తింపు” అని తెలిపారు. GIO ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మరియు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ గుర్తింపు మరియు ఈ గౌరవం నన్ను మరింతగా నేర్చుకునేందుకు, మరిన్ని సేవా కార్యక్రమాలు చేసేందుకు, తనను ప్రేరేపిస్తుందని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా మరియు అంతర్జాతీయం గాను సమాజ అభివృద్ధికి పనిచేయడంలో నేను మరింత నిబద్ధతతో ముందుకు సాగుతాను” అని శ్రీ వెంకప్ప భాగవతుల గారు అన్నారు.