తెలుగు వారి సంప్రదాయ ఐక్యత మహోత్సవం వనభోజనాల కార్యక్రమం ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో దక్షిణ ఆస్ట్రేలియా ఎన్నారై టీడీపీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలుగు వారికి గుర్తింపు ని ఇచ్చి, తెలుగు జాతి కి ప్రియుడు అయిన అన్న నందమూరి తారకరామారావు స్ఫూర్తితో విజయవంతంగా ముగిసింది.
స్థానికంగా నివాసం ఉంటున్న తెలుగు ప్రజలను ఐక్యం చేయాలి అనే ఉద్దేశం తో నిర్వహించిన ఈ వనభోజన మహోత్సవంలో 20 రకాల తెలుగు వంటకాలు వడ్డించారు. చిన్నారులకు, మహిళలకు పలు గ్రామీణ ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు.
అక్టోబర్ 16 ఆదివారం రోజున అడిలైడ్ లో ఉండే తెలుగు వారు అంతా అధిక సంఖ్యలో ఒక్కచోటకి జేరడంతో అందరూ రోజు అంతా సరదాగా ఆడుతూ పాడుతూ పరిచయాలు పెంచుకుంటూ, ముచ్చట్లు ఆడుకుంటూ ఆనందంగా గడిపారు.
ముఖ్యంగా వచ్చే ఏడాదికి తెలుగు వారి అన్నగారు నందమూరి తారక రామారావు జన్మించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా శత జయంతి వేడుకలు నగరంలో భారీ స్థాయిలో నిర్వహించేలా ప్రణాళిక రచించారు.
ఈ ప్రణాళికలో భాగంగా తెలుగు వారి అందరిని భాగస్వాములను చేయాలి అనే లక్ష్యం తో మున్ముందు ఇంకా తెలుగు వారి ఐక్యత కార్యక్రమాలతో ముందుకు వెళ్తాము అని తెలుగుదేశం అడిలైడ్ కమిటీ సభ్యులు తెలిపారు.