ఆంధ్రప్రదేశ్ కి 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి తెలుగుజాతిని ప్రపంచ పటంలో పెట్టిన నారా చంద్రబాబు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా UK లో ఉన్న NRI లు లండన్లోని బ్రిటన్ పార్లమెంట్ ముందు నిరసన ప్రదర్శన జరిపారు. అంతకు ముందు లండన్లోని WEST MINSTER నందుగల మహాత్మాగాంధీ విగ్రహం వద్ద దీక్షకు కూర్చుని చంద్రబాబు గారి ఆక్రమ అరెస్టుని ఖండిస్తూ శాంతియుత నిరసన ప్రదర్శన జరిపారు.
రాష్టంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలుచేయకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలు జరపడం సిగ్గుచేటని, AP Skill Development Corporation ద్వారా లక్షాలది యువతకి బంగారు భవిత నిచ్చిన బాబు గారిని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ జేయటం హేయమైన చర్య అని ఖండించారు.
ముఖ్యమంత్రి లండన్ పర్యటన పట్ల ప్రజల్లో పెరుగుతున్న అపోహల నుంచి, అలాగే రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన నుంచి ప్రజల దృష్టిని మరల్చటానికె ఈ అక్రమ అరెస్ట్ అని, పోలీసు వ్యవస్థని ఇంత దారుణంగా నిర్వీర్యం చేస్తూ ప్రజల హక్కులు కాలరాస్తున్న ఈ సైకో పాలన పోయి మళ్లీ బాబు గారే ముఖ్యమంత్రిగా రావాలని, మంచోన్ని జైల్లో పెట్టి మానసికంగా హింసించి శాడిస్టిక్ ఆనందం పొందాలని చూస్తున్న జగన్ రెడ్డికి ప్రజలు ఓటు ద్వారా సరైన బుద్ధి చెప్తారని NRI లు తెలిపారు. ప్రజల ఆస్తులని తాకట్టు పెడుతూ అప్పుల మీద కూడా ప్రభుత్వాన్ని నడపలేక ఇలా డైవర్షన్ పాలిటిక్స్ ఎన్నాళ్లని ఈ సందర్భంగా ఖండించారు.