ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో 2023 జులై 7, 8, 9 తేదీలలో నిర్వహించనున్న మహాసభల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవి మందలపు దుబాయ్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. అలాగే రవి మందలపు రాబోయే తానా ఎన్నికలలో డోనార్ విభాగంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ పదవికి పోటీ చేస్తున్నారు.
దుబాయ్ లోని హైగేట్ ఇంటర్నేషనల్ స్కూల్ సంస్థకి ఛైర్మన్ గా ఉన్న రవి మందలపు వ్యాపార నిమిత్తం దుబాయ్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా United Arab Emirates (UAE) Telugu Association వారు స్థానిక కాలమానం ప్రకారం మార్చి 19, ఆదివారం రోజున నిర్వహించిన ఒక ముఖ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.
రవి మందలపు ని వేదిక మీదకు ఆహ్వానించి UAE తెలుగు అసోసియేషన్ వారు సత్కరించారు. శాలువా, జ్ఞాపికతో తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు ఘనంగా రవి ని సత్కరించారు. ఈ సందర్భంగా సభని ఉద్దేశించి రవి మందలపు కాసేపు ప్రసంగించారు.