Connect with us

Associations

భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి UAE తెలుగు అసోసియేషన్ సన్మానం

Published

on

భారతదేశ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు తమ నాలుగు రోజుల దుబాయి పర్యటనలో భాగంగా యూఏఈ తెలుగు అసొసియేషన్ వారు దుబాయి లోని భారత కాన్సులేట్ జనరల్ ప్రాంగణంలో జనవరి 3 సాయంత్రం ఏర్పాటు చేసిన సన్మాన సభలో పాల్గొన్నారు.

తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ దినేష్ కుమార్ ఉగ్గిన వెంకయ్య నాయుడు గారిని సాదరంగా ఆహ్వానిస్తూ స్వాగత ఉపన్యాసం చేశారు. దుబాయి లోని భారత కాన్సుల్ జనరల్ డాక్టర్ అమన్ పురి గారు దేశానికి వెంకయ్య నాయుడు గారు చేసిన సేవలను కొనియాడరు. శ్రీమతి తాడు మాము గారు ఇతర సిబ్బంధి కార్యక్రమంలో పాల్గొన్నారు.

వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ జనని, జన్మభూమి, మాతృభాష, మాతృదేశం, చదువుచెప్పిన గురువులను ఎన్నడూ మరువరాదని అన్నారు. మనిషికి మాతృభాష కళ్ళ వంటిది అయితే ఇతర భాషలు కళ్ళజోడు వంటివని, మాతృభాషను, మన కట్టు, బొట్టు, ప్రాస, యాస, గోసలను కాపాడుకోవాలని కోరారు.

భారతదేశంలో మన వేద పురాణ కాలం నుండే మహిళకు ఒక ప్రత్యేక స్టానం ఇవ్వబడిందని, మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారు పిలిపునిచ్చినట్టుగా ఆడపిల్లలను సంరక్షించాలని, చదివించాలని, ప్రోత్సాహించాలని కోరారు. ప్రపంచం శర వేగంతో ముందుకు వెళ్తోందని, మన భారతదేశం నిపుణతకు, మేధస్సు, నిజాయితీ లకు పెట్టునిల్లు అని, సంకల్పం, దృఢ నిశ్చయం, పట్టుదల, కఠోర పరిశ్రమతో విశ్వగురువుగా మళ్ళీ అవతరించబోతోందని చెప్పారు.

సాంకేతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వైజ్ఞానిక రంగాల్లో భారత్ దే పై చేయి అని, ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని చెప్పారు. మన పూర్వ వృత్తాంతన్ని మననం చేసుకుంటూ, మన మూలాలను మరవకుండా, మనుగడను కొనసాగించి పురోభివృద్ది చెందాలని కోరారు. ప్రతీ ఒక్కరూ తమ, తమ కుటుంబ, సమాజ, ప్రాంత, రాష్ట్ర మరియు దేశ శ్రేయస్సు కొరకు పాటుపడాలని సందేశాన్ని ఇచ్చారు.

య.ఏ.ఈ లోని ఉభయ రాష్ట్రాల తెలుగు వారిని సంఘటిత పరుస్తూ, తెలుగు సంసృతిని సంరక్షిస్తున్న తెలుగు అసోసియేషన్ సేవలను వెంకయ్య నాయుడు గారు ప్రత్యేకంగా కొనియాడారు. ఈ సందర్భంగా దుబాయి లోని చిన్నారులు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.

తెలుగు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ వివేకానంద బలుసా, SRR బిల్డింగ్ మెటేరియల్స్ అధిపతి శ్రీ తోట రామకుమార్ గారు, దినేష్ కుమార్ ఉగ్గిన గారు వెంకయ్య నాయుడు గారిని సన్మానించి, సన్మాన పత్రం, శాలువా, జ్ఞాపికలను బహుకరించారు. ఈ కార్యక్రమానికి వక్కలగడ్డ వేంకట సురేష్, ఆర్జె జాహ్నవి లు సంధానకర్తలు గా వ్యవహరించారు. తెలుగు అసోసియేషన్ తరఫున శ్రీధర్ దామెర్ల, శ్రీనివాస్ యండూరి, నూకల మురళీ కృష్ణ, సురేంద్ర దండేకుల, అంబేడ్కర్, విజయ్ భాస్కర్, మోహన్ MVSK, లతా నగేశ్, ఫహీమ్ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలు చూసుకున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected