Connect with us

News

తెలంగాణలో మెడికల్ క్యాంపు తో TTA సేవాడేస్ కి గ్రాండ్ స్టార్ట్

Published

on

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) అధ్వర్యంలో మొదటి రోజు సేవా డేస్ కార్యక్రమంలో భాగంగా రెడ్ క్రాస్ గౌట్ స్కూల్ మసాబ్ టాంక్ లో జరిగింది. స్కూల్ ప్రిన్సిపాల్ సుమిత్ర గారు వారి NCC బృందంతో TTA సంఘం సభ్యులను సాదరంగా “గాడ్ ఆఫ్ ఆనర్” మార్చ్ ఫాస్ట్ ద్వారా స్వాగతం పలికారు.

తదనంతరం స్వయంగా సుమిత్ర గారు వారి అధ్యాపక బృందం తో TTA సభ్యులను వేదికపైకి ఆహ్వానించి గౌరవించారు. TTA అధ్యక్షులు వంశీ రెడ్డి గారు సభకు అధ్యక్షులు గా వ్యవహరించారు. స్కూల్ పిల్లల ఆట పాట లతో కార్యక్రమం ఆహ్లాదకరంగా మారింది. చిరంజీవి హారిక పడిన “యెట్టగయ్య శివ శివ” అనే పాట ఆహుతులను ముఖ్యంగా TTA సభ్యులను ఆకట్టుకుంది.

మరో విద్యార్థిని కీర్తన “పాటమ్మ తోనే ” అనే పాట తో ఆహుతులను మంత్ర ముగ్ధులను చేసింది. ఈ ఇద్దరికీ TTA నుండి నగదు బహుమతిగా అందించారు. కార్యక్రమంలో పిల్లలకు డెంటల్ చెకప్, డెంటల్ కిట్స్, శానిటరీ పాడ్స్, ఉమన్ అవేర్నెస్ ప్రోగ్రామ్, ప్రతి ఒక్కరికీ ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది.

అమర దేవి అనే ఒక చిన్నారి జిమ్నాస్టిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిందని తెలుసుకున్నా TTA ప్రసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల గారు 5వేల నగదు భహుమతి ఇచ్చి ఆశీర్వదించారు. రానున్నరోజుల్లో ఒలింపిక్స్ లో ఆడేలా కృషి చేయాలని ప్రోత్సహించారు.

ఈ కార్యక్రమంలో TTA అధ్యక్షులు వంశీ రెడ్డి గారు మాట్లాడుతూ.. రేపటి దేశ భవిష్యత్తు ఈ రోజు నవతరమని వారి ఆరోగ్యం పదిలపరచడం మన దేశ భవిష్యత్తు తో ముడి పడి ఉందన్నారు. అందుకే TTA వారి ఆరోగ్యం పౌష్ఠికాహారం పై దృష్టి సారించింది అని తెలిపారు. డా. రచన గారు డెంటల్ హెల్త్ గురించి పిల్లలకు సౌదరణంగా వివరించారు.

డా మధులిక గారు ఉమన్ హెల్త్ మరియు న్యుట్రిషన్ గురించి వివరించారు. DEO వెంకటేశ్వర్లు గారికి, ప్రిన్సిపాల్ సుమిత్ర గారికి మరియు పాటశాల అధ్యాపకులకు TTA బృందం శాలువా మరియు బోకే తో పాటు మేమొంటోలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 500 మంది పిల్లలు పాల్గొనడం జరిగింది.

సేవాడేస్ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా సురేష్ రెడ్డి వెంకన్నగారి గారు, ఇంటెర్నేషనల్ కోఆర్డినేటర్ గా డా. డి ద్వారకనాథ రెడ్డి గారు, కో-కోర్డినేటర్ గా దుర్గా ప్రసాద్ సెలోజ్ గారు, ఫౌండేషన్ సర్వీస్ చైర్ గా సంతోష్ గంటారం గారు, ఇంటెర్నేషనల్ వైస్ ప్రసిడెంట్ గా ప్రసాద్ కునారపు గారు, హెల్త్ అండ్ వెల్నెస్ అడ్వైసర్ గా జ్యోతిరెడ్డి దూదిపాల గారు, నర్సింహా పెరుక గారు – కమ్యూనిటీ సర్వీసెస్ చైర్ గా, ప్రెసిడెంట్ గా వంశీరెడ్డి కంచరకుంట్ల గారు, ప్రసిడెంట్ ఎలెక్ట్ గా నవీన్ రెడ్డి మలిపెద్ది గారు మరియు కార్యదర్శిగా కవితారెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

TTA సభ్యులు శివారెడ్డి కొల్లా, మనోహర్ బొదుకే, ప్రదీప్ మెట్టు, సంగీత రెడ్డి బొర్రా, వెంకట్ గడ్డం, ప్రదీప్ బొద్దు, అభిలాష్ రెడ్డి, అనిల్ అర్రబల్లి, వాణి గడ్డం, శ్రీధర్ చదువు, ఆహ్లాదరెడ్డి కారెడ్డి, గణేష్ మాధవ్ వీరమనేని మరియు కవితారెడ్డి సేవా డేస్ లో పాల్గొనడం జరిగింది.

తెలుగు కళల తోట తెలంగాణ సేవల కోట అనే నినాదంతో 2015 లో తెలంగాణా అమెరికన్ తెలుగు అసోసియేషన్ స్థాపించబడినది. తెలంగాణ తరుపున విదేశాలలో ఏర్పడిన మొట్టమొదటి సాంస్కృతిక సంస్థ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్.TTA founder founder Pailla Malla Reddy Garu, Advisory consul chair – Vijaypal reddy గారు, Co-chair – Mohan Patlolla గారు, Member – Bharat Madadi గార్ల ఆధ్వర్యంలో 2015 లో మొదలై, ప్రస్తుత ప్రసిడెంట్ వంశీరెడ్డి కంచరకుంట్ల గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో సేవాకార్యక్రమాలతో దూసుకుపోతున్నది.

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) తెలుగు రాష్ట్రాలలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే సేవ డేస్ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా నిర్వహించ తలపెట్టింది. ఈ కార్యక్రమంలో విద్య ద్వారా ఉపాధి మార్గాలు, వ్యాపార వృద్ధితో ఆర్ధిక వనరుల అభివృద్ధి, ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక, జాబ్ ఓరియెంటెడ్, ఉపాధి కల్పన, యూత్, మహిళా సాధికారత కోసం చేసే అవేర్నెస్ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.

ఈ కార్యక్రమాలు ముఖ్యంగా తెలంగాణ అంతటా హైదరాబాద్, అచ్చంపేట, నల్గొండ, దేవరకొండ, బోనగిరి, సిద్ధిపేట, వికారాబాద్, యాదగిరిగుట్ట లలో ఉంటాయని తెలిపారు. మరిన్ని ఫోటోలకు www.NRI2NRI.com/TTA Seva Days Day1 ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected