Connect with us

News

TTA Mega Convention కి చకచకా ఏర్పాట్లు; తమన్ కాన్సర్ట్ Grand Finale @ Seattle, Washington

Published

on

2024 మే 24 నుంచి 26 వరకు అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం, సియాటిల్ (Seattle) మహానగరంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్ (TTA Mega Convention) నిర్వహణకు పలు కమిటీలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

Telangana American Telugu Association (TTA) లాంటి చక్కని ప్లాట్ ఫామ్ ని ఏర్పాటుచేసిన వ్యవస్థాపకులు డా. పైళ్ల మల్లారెడ్డి (Dr. Pailla Malla Reddy), అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్ డా. విజయపాల్ రెడ్డి, కోఛైర్ డా. మోహన్ రెడ్డి పటలోళ్ళ, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి దిశానిర్దేశం చేస్తున్నారు.

ఇప్పటికే నిధుల సేకరణలో భాగంగా అమెరికాలోని పలు నగరాల్లో కిక్ ఆఫ్ ఈవెంట్స్ (Kick Off & Fundraiser) విజయవంతంగా నిర్వహించారు. అధ్యక్షులు వంశీ రెడ్డి కంచరకుంట్ల (Vamshi Reddy Kancharakuntla) మరియు కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజు ఆధ్వరంలో అమెరికాలోని మేజర్ సిటీస్ లో స్థానిక TTA Chapters నిర్వహణలో ఈ కిక్ ఆఫ్ ఈవెంట్స్ నిర్వహించారు.

ఇప్పుడు మెగా కన్వెన్షన్ ప్రోగ్రాం లైన్ అప్, లాజిస్టిక్స్ తదితర విషయాలపై ఫోకస్ పెట్టారు. పలువురు ప్రముఖులు (Celebrities) తాము కూడా కన్వెన్షన్ కి వస్తున్నట్లు, అలాగే అందరినీ ఆహ్వానిస్తూ ప్రోమోస్ విడుదల చేశారు. వీరిలో టాలీవుడ్ నుంచి యాంకర్స్ సుమ & రవి మరియు బిగ్ బాస్ విన్నర్ కౌశల్ తదితరులు ఉన్నారు.

ఇంకా పలువురు రాజకీయ, సినీ, సాహితీ ప్రముఖులు రానున్నారు. గ్రాండ్ ఫినాలే లో భాగంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న సంగీత దర్శకులు తమన్ (Ghantasala Sai Srinivas Sivakumar) తన టీంతో లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ (Live Musical Show) చేయనున్నారు.

బ్యూటీ పాజెంట్, TTA స్టార్, రీల్స్ కాంటెస్ట్ వంటి పలు పోటీలను అమెరికాలోని పలు నగరాల్లో నిర్వహిస్తున్నారు. భద్రాచల శ్రీ సీతారాముల కల్యాణోత్సవం, మ్యాట్రిమోనీ & ఉమెన్ ఫోరమ్స్, సెమినార్స్, ఎక్సిబిట్స్, మీట్ అండ్ గ్రీట్స్ తదితర ప్రోగ్రామ్స్ ఈ TTA Mega Convention లో ప్రత్యేకంగా ఆకట్టుకోనున్నాయి.

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (Telangana American Telugu Association) మెగా కన్వెన్షన్ (Convention) ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. నాయకులు, వివిధ కమిటీల సభ్యులు, వాలంటీర్స్ ఇలా అందరూ సమిష్టిగా కృషి చేస్తున్నారు. ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ టికెట్ రెజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ చేశారు. www.ttaconvention.org లో మీరు అందరూ త్వరగా టికెట్స్ బుక్ చేసుకోండి.

కన్వెన్షన్ అడ్వైజరీ కమిటీ
డా. పైళ్ల మల్లారెడ్డి
డా. విజయపాల్ రెడ్డి
డా. మోహన్ రెడ్డి పటలోళ్ళ
భరత్ రెడ్డి మాదాడి
వంశీ రెడ్డి కంచరకుంట్ల

కన్వెన్షన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ
వంశీ రెడ్డి కంచరకుంట్ల
చంద్రసేన శ్రీరామోజు
నవీన్ రెడ్డి మల్లిపెద్ది
గణేష్ మాధవ్ వీరమనేని
మాణిక్యం తుక్కాపురం
మనోహర్ బాదుకే
డా. నరసింహా రెడ్డి దొంతిరెడ్డి
కవితా రెడ్డి
సహోదర్ రెడ్డి పెద్దిరెడ్డి
డా. దివాకర్ జంధ్యం
శివా రెడ్డి కొల్ల
ప్రదీప్ మెట్టు
ప్రసాద్ కునారపు
సురేష్ రెడ్డి వెంకన్నగారి
ఉషా రెడ్డి మన్నెం

కన్వెన్షన్ రీజినల్ అడ్వైజర్స్
నవీన్ గోలి
మనోజ్ చింతిరెడ్డి
అనీల్ ఎర్రబెల్లి
డా. ద్వారకానాథ్ రెడ్డి

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected