Published
3 months agoon
By
NRI2NRI.COMEdison, New Jersey: తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమై, తెలంగాణ మహిళల పండగ అంటే మనందరికీ గుర్తుకొచ్చేది పండగే బతుకమ్మ. TTA ప్రారంభమైన నుండి ఘనంగా, వైభవంగా ప్రతి సంవత్సరం అమెరికా అంతటా బతుకమ్మ పండగ జరుపుతోంది. వేలాది మంది ఈ సంబరాలకు వచ్చి బతుకమ్మ పండగపై, తెలంగాణ సంస్కృతి (Telangana Culture) పై తమకున్న అభిమానాన్ని చాటుతున్నారు.
TTA వ్యవస్థాపకులు డా. పైళ్ల మల్లారెడ్డి ఆశీస్సులతో, Advisory Chair డా విజయపాల్ రెడ్డి, Advisory Co-Chair మోహన్ రెడ్డి పట్లోళ్ల, Advisory Member భరత్ మాదాడి, సంస్థ అధ్యక్షులు వంశీ రెడ్డి, President Elect నవీన్ రెడ్డి మలిపెద్ది గార్ల నిర్ధేశకత్వంలో, General Secretary & Nationwide Bathukamma Advisor శ్రీమతి కవితా రెడ్డి గారి మార్గ దర్శకత్వంలో ఈ సంవత్సరం కూడా అన్నిచోట్లా బతుకమ్మ పండగ సంబరాలు రంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి.
టిటిఎ అడ్వైసరీ కో చైర్ మోహన్ రెడ్డి పట్లోళ్ల (Dr. Mohan Reddy Patalolla) స్వంత రాష్టం న్యూజెర్సీ లో బతుకమ్మ సంబరాలు మిన్ను ముట్టాయి. TTA జాయింట్ సెక్రటరీ శివారెడ్డి కొల్ల మరియు బోర్డు అఫ్ డైరెక్టర్స్ సుధాకర్ ఉప్పల, నర్సింహ పెరుక, నరేందర్ యారవ నేతృత్వంలో, New Jersey Convention and Exposition Center, Edison నగరము నందు శనివారం, Oct 5, 2024 న నిర్వహించిన సంబరాలు 5000 మందికి పైగా ఆహుతులతో కిక్కిరిసింది.
టిటిఎ (Telangana American Telugu Association) న్యూజెర్సీ రీజినల్ వైస్ ప్రెసిడెంట్స్ మధుకర్ రెడ్డి, సాయి గుండూర్ మరియు Core Committee సభ్యులు అరుణ్ ఆర్కాల, దీప జలగం, రాజా నీలం, ప్రశాంత్ నలుబంధు, శంకర్ రెడ్డి వులుపుల, శ్రీనివాస్ రెడ్డి మాలి, నవీన్ కౌలూరు, నవీన్ యలమండల, శ్రీనివాస్ జక్కిరెడ్డి, వెంకీ నీల, విష్ణు రెడ్డి, రఘువీర్ పి., శివ నారా, బాల గణేష్, సాయిరామ్ గాజుల, ప్రణీత్ నల్లపాటి మరియు ఎందరో స్వచ్చంద సేవకులు తమవంతు కృషి చేసారు.
ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పండగకు సంప్రదాయ అలంకారణతో, తము చేసిన బతుకమ్మలతో వస్తున్న మహిళలు, పురుషులు మరియు పిల్లలతో సందడి మొదలయ్యింది. డప్పు (Dhole) చప్పుళ్లతో బతుకమ్మలకు ఘనమైన స్వాగతం లభించింది. ఈ సంబారాలకు 200 పైగా బతుకమ్మలు తీసుకొని వచ్చారు న్యూ జర్సీ వాసులు. సాయి దత్త పీఠంకు చెందిన పురోహితులు భాస్కర శర్మ గారు, TTA కార్యవర్గంతో గౌరి దేవి పూజ చేయించి బతుకమ్మ పండగను ఆరంభించారు.
TTA (Telangana American Telugu Association) కమిటీ సభ్యులందరూ ఈ పూజలో పాల్గొన్నారు. ప్రాంతీయ గాయని గాయకులు డా. మధు దౌలపల్లి గారు, బ్రాహ్మిణి వనమ తమ మధుర గానంతో అలరింపజేశారు. శ్వేత కొమ్మొజీ కార్యక్రమానికి వ్యాఖ్యాత వ్యవహరించడమే కాకుండా అందరితో బతుకమ్మ లాడుతూ మహిళలను మరింత ఉత్తేజ పరిచారు. తెలంగాణ నుండి విచ్చేసిన ప్రముఖ జానపద కళాకారుడు శ్రీ బిక్షు నాయక్ గారు, మహిళలందరికీ మార్గదర్శకం చేస్తూ, తన ఆట పాటలతో అందరినీ ఉత్సాహ పరుస్తూ, బతుకమ్మ ఆడించారు.
చక్కగా అలంకరించుకొని, వేలాది మహిళలు, అమ్మాయిలు చుట్టూ తిరుగుతూ బతుకమ్మ (Bathukamma) ఆడడం లయ విన్యాసం అమోఘం అపూర్వం. వర్ణించడానికి మాటలు సరిపోని ఒక అనిర్వచనీయమైన అనుభూతి పొందారు వచ్చేసిన ఆహుతులంతా. సువిశాలమైన ఈ ప్రాంగణంలో మహిళలు, పిల్లలు కమనీయంగా రమణీయంగా బతుకమ్మ పాటలకు చక్కగా ఆడగులు వేస్తూ మనం తెలంగాణాలో (Telangana) ఉన్నామా అన్న భావనను కలిగించారు.
12 అడుగుల ఎత్తైన అద్భుతమైన బతుకమ్మ (Bathukamma) ఈ సంబరాలకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రమణ, శ్రీమతి దీప జలగం, నరసింహా పెరుక మరియు వాలంటీర్లు ఈ బతుకమ్మ తయారీకి సహాయం చేశారు. వివిధ స్థానిక మరియు జాతీయ సంస్థల (TFAS, ATA, TANA, NATS, NATA, TDF) నుండి ప్రముఖులు విచ్చేసి ఈ సంబరాలలో తాము ఒక భాగం అయ్యారు. సుధాకర్ ఉప్పల గారు, శివా రెడ్డి గారు వీరందిరినీ వేదిక మీదికి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన కార్యావర్గాన్ని సభికులకు పరిచయం చేసారు. JOYALUKKAS మరియు Anjani Designers by Swetha Rao వారు చక్కగా పేర్చిన బతుకమ్మలకు విలువైన బహుమతులు అందజేసారు. Maaya Fine Jewels వారు చక్కగా అలంకరించుకొన్న మహిళలకు బహుమతులు అందజేసారు. Malabar Gold and Diamonds వారు Raffle Prizes అందజేసారు. అలాగే Sparkles by Swathi Designs వారు బహుమతులు ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి న్యూ జెర్సీ (New Jersey) కి చెందిన స్థానిక నాయకులు, ప్రముఖులు విచ్చేసి అందరికీ తమ అభినందనలు, శుభాకాంక్షలు అందజేసారు. TTA ముఖ్యులు నర్సింహా రెడ్డి దొంతిరెడ్డి రెడ్డి గారు (EVP), సురేశ్ రెడ్డి వెంకన్నగారి, ప్రసాద్ కునారపు, పవన్ రవ్వ, కిరణ్ గూడూరు ఈ సంబరాలకు రావడం సంతోషకరం. వచ్చిన ప్రముఖులలో కొందరు – అజయ్ పాటిల్ (Councilman, Edison Township) మరియు సామ్ థామ్సన్ (New Jersey State Senator) గార్లు తమ శుభాకాంక్షలు అందజేసారు.
Sponsors, Donors, Artists అందరికీ జ్ఞాపికలు అందజేసారు. TTA BOD నరేందర్ యారవ గారి ఆధ్వర్యంలో బతుకమ్మల నిమజ్జనం (Bathukamma Immersion) ఘనంగా జరిగినది. TTA న్యూ జెర్సీ టీం సభ్యులు మరియు పలువురు (ముఖ్యంగా యువత) ఈ బతుకమ్మ పండగ ఘనంగా జరగడానికి కృషి చేశారు. వస్త్రాలు, నగలు మరియు ఇతర విక్రేతలు తమ తమ స్టాల్స్ తో వచ్చిన వారికి షాపింగ్ సదుపాయం కల్పించారు.
ఈ కార్యక్రమం ఘనంగా జరగడానికి తోడ్పడిన స్వచ్చంద సేవకులందరికీ, ధన సహాయం చేసిన దాతలకు, చక్కగా బతుకమ్మలను చేసిన మహిళలకు, మీడియాకు మా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి సహాయం చేసిన sponsors – Malabar Gold & Diamonds, Joyalukkas, Maaya Fine Jewels, NY Life, Bond Street Mortgage, Pepper House, Bay Leaf Indian Restaurant, ANG Infotech, Nihi Foods, Sparkles Decor, Iconic Era Properties, House of Biryani’s and Kebab’s. వీరందరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.
TTA Leadership Team from New Jersey: మోహన్ రెడ్డి పట్లోళ్ల (TTA Advisory Council Co-Chair),శివా రెడ్డి (TTA Joint Secretary & Board of Director)
TTA Board of Directors from New Jersey: సుధాకర్ ఉప్పల, నర్సింహ పెరుక, నరేందర్ యారవ
TTA Regional Vice Presidents: మధుకర్ రెడ్డి, సాయి గుండూర్
TTA Membership Chair: అరుణ్ రెడ్డి అర్కాల
TTA New Jersey Core Team: దీప జలగం, అనూష రెడ్డి, లలిత రెడ్డి, రాజా నీలం, ప్రశాంత్ నలుబంధు, శంకర్ రెడ్డి వులుపుల, శ్రీనివాస్ రెడ్డి మాలి, నవీన్ కౌలూరు, నవీన్ యలమండల, శ్రీనివాస్ జక్కిరెడ్డి, వెంకీ నీల, విష్ణు రెడ్డి, రఘువీర్ పి., శివ నారా, బాల గణేష్, సాయిరామ్ గాజుల, ప్రణీత్ నల్లపాటి, సతీష్ మేకల, శిల్ప రామడుగు.
TTA New Jersey Youth Team: నిమిష పెరుక, ఆశ్రిత్ యారవ, హసిక ఆర్కాల, సుజయ్ వులుపుల, యాస్మిత బొమ్మూ, విద్యావతి అలవకొండ, ఇసితా రెడ్డి మాలి, వేదాంశి గొట్టుముక్కల, శృతి కృష్ణ పేరుమల, సుచిర్ బత్తిని, హర్షిత్ యారవ, రిషితా జంబుల.