చికాగోలోని ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ (Tri-State Telugu Association) January 28న సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక హిందూ టెంపుల్ ఆఫ్ గ్రేటర్ చికాగో (Hindu Temple of Greater Chicago) లామోంట్ ఆలయ ప్రాంగణంలో సంస్థ అధ్యక్షులు శ్రీ హేమంత్ పప్పు గారు, ఎగ్జిక్యూటివ్ టీం స్వప్న పులా, సోమలత యనమందల, మధు ఆరంబాకం మరియు భాను సీరం సహకారంతో ఎంతో వైభవోపేతంగా నిర్వహించారు.
ప్రణతి కలిగొట్ల ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత గా ఎంతో ఉత్సహంగా, విజయావంతముగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగడానికి జగదీశ్ కానూరు, శ్రీనాథ్ వాసిరెడ్డి, వీరాస్వామి అచంట, హేమచంద్ర వీరపల్లి, రామకృష్ణ కొర్రపోలు, ప్రసాద్ మరువాడ, దిలీప్ రాయలపూడి, గుప్త నాగుబండి, అపర్ణ అయ్యలరాజు, ప్రశాంతి తాడేపల్లి, దీప్తి చిరువూరి, రవి వేమూరి ఎంతో తోడ్పడ్డారు.
ఈ కార్యక్రమానికి వందల సంఖ్యలో వచ్చిన సభ్యుల నడుమ అన్ని వయస్సుల వారు పాల్గొని, తెలుగు సంస్కృతి (Telugu Culture) ని ప్రతిఫలించే సంగీత, నాట్య కార్యక్రమాలతో పాటు, చిత్ర గీత నృత్యాలు మరియు పాటలు ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు.
Tri-State Telugu Association (TTA), Chicago Area, Illinois నిర్వహించిన ఈ సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమానికి KK రెడ్డి, అశోక్ లక్ష్మణ్, సాయి రవి సూరిభొట్ల, రాజ్ పొట్లూరి మరియు రమేష్ నాయకంటి విచ్చేసారు.
ఈ కార్యక్రమానికి TANA (Telugu Association of North America) సభ్యులు హేమ కానూరు, కాశి పాటూరి, కృష్ణ మోహన్ చిలమకూరు, రవి కాకర, చిరు గళ్ళ, శ్రీహర్ష గరికపాటి, ఉమా కటికి, శ్రీనివాస్ పెదమల్లు, శ్రీనివాస్ అట్లూరి విచ్చేసి పార్టిసిపంట్ కు సర్టిఫికెట్స్ బహుకరించి ప్రోత్సహించారు.