Connect with us

Felicitation

ఏకతాటిపై చికాగో తెలుగు సంఘాలు; ఆస్కార్ విజేత చంద్రబోస్ కి ఘన సన్మానం

Published

on

ఇలినాయిస్ రాష్ట్రంలోని చికాగో (Chicago) మహానగరంలో సినీ గేయ రచయిత ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ గారి కి 20 పైగా ఉన్న తెలుగు సంఘాల ప్రతినిధులు నాపర్విల్ (Naperville) లోని మాల్ అఫ్ ఇండియా (Mall Of India) లో జూన్ 11 వ తారీఖున ఎంతో ఘనంగా సత్కరించారు.

దాదాపు 400 పైగా తెలుగు వారు పాల్గొన్న ఈ కార్యక్రమానికి అమెరికన్ తెలుగు అసోసియేషన్ (American Telugu Association) ప్రతినిధులు ప్రాతినిధ్యం వహించారు. సంస్థలన్నీ కలసి చంద్రబోస్ గారిని మంగళ హారతితో మేళ తాళాలతో ఘనంగా స్వాగతం పలికారు.

చంద్ర బోస్ (Subhash Chandrabose Kanukuntla) గారిని ప్రేక్షకులు నిల్చొని కరతాళ ధ్వనులతో రెడ్ కార్పెట్ మీద వేదికకు ఆహ్వానించారు. తెలుగు సంఘ ప్రతినిధుల నడుమ ఆటా వ్యవస్థాపకుడు హనుమంత్ రెడ్డి గారు చంద్రబోస్ గారిని ఘనంగా సన్మానించారు.

ఆటా, తానా, అమెరికా తెలుగు సంఘం, ఆప్త, నాటా, నాట్స్, న్రివ, టీడీఫ్, సిలిసిన్ ఆంధ్ర మనబడి, టి.ఆ.జి.సి., టి.టి. ఏ, సి.ఏ ఏ, చితా తదితర సంఘాల ప్రతినిధులు తమ సంస్థ తరపున చంద్రబోస్ (Subhash Chandrabose Kanukuntla) గారిని ఘనంగా సన్మానించారు.

చంద్రబోస్ (Subhash Chandrabose Kanukuntla) గారు మాట్లాడుతూ గంటకి పైగా తెలుగు సంఘాలు అన్ని కలిసి తనకు సన్మానం చెయ్యటం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. తెలుగు (Telugu) బాష తియ్యదనం, ప్రాశస్త్యం గురించి వివరించారు.

అవసరం, ఆవశ్యకత ఉన్నప్పుడు అందరు ఏకం అవుతారు అని ఆస్కార్ నిరూపించటం చాలా ఆనందదాయకం అన్నారు. చంద్ర బోస్ గారు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అన్ని వయస్సుల వారితో ఆడిటోరియం ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

చంద్రబోస్ (Subhash Chandrabose Kanukuntla) గారి మాటలకు హర్షాతిరేకాల ప్రతిస్పందనలతో మార్మోగిపోయింది. ఆయన సందేశాత్మక ప్రసంగం అన్ని వర్గాల ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను విశేషంగా ఆకర్షించింది.

ఈ కార్యక్రమ విజయానికి తోడ్పడిన వారు సాయినాథ్ రెడ్డి బోయపల్లి, భాను స్వర్గం, రత్నాకర్ రెడ్డి అర్జుల, సుచిత్రారెడ్ది, మహీధర్ ముస్కుల, వెంకటరామ్, మాలతి దామరాజు, గౌరీ శంకర్ అద్దంకి, సత్యనారాయణ రెడ్డి కందిమళ్ల, కరుణాకర్ మాధవరం, హేమ కానూరు, కృష్ణమోహన్ చిలంకూరు, పరమేశ్వర్ ఎర్రసాని, సత్య తోట, రమేష్ తూము, నివాస్ పెదమల్లు, హేమచంద్ర వీరపల్లి, శ్రీని ఓరుగంటి, అశోక్ పగడాల, అమర్ నెట్టెం, హను చెరుకూరి, నివాస్ పాల్తేపు, నగేష్ దూలం, ఉమా కటికి, సుజాత అప్పలనేని, హరిణి మేధా, శ్వేతా కొత్తపల్లి, శిరీష మద్దూరి, వాసవి చక్క.

ఆస్కార్ అవార్డు విజేత చంద్రబోస్ (Subhash Chandrabose Kanukuntla) గారి కార్యక్రమం ఇంత ఘనంగా జరిగేందుకు ఎంతో తోడ్పాటుని అందించిన వివిధ సంఘాల ప్రతినిధులకు నిర్వహకులకు హర్షధ్వానాలతో కృతజ్ఞతలు తెలిపారు.

చంద్రబోస్ (Subhash Chandrabose Kanukuntla) గారి గౌరవార్థం, స్థానిక కళాకారులు, చిన్నారులు ఆయన వ్రాసిన పాటలతో సంగీత, నృత్య కార్యక్రమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs) నిర్వహించారు.

ఈ ఘన సన్మాన కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా ఉన్న ప్రణతి కలిగొట్ల, మాధురి హరి ఆద్యంతం ప్రేక్షకులను అలరించారు. ఆస్కార్ (Oscar) నేపథ్యంలో రవి తోకల చేసిన వేదికాలంకరణ (Venue Decoration) అందర్నీ మంత్రముగ్ధులను చేసింది.

ప్రవీణ్ జలిగామ, రవి తోకల, మణి తెల్లాప్రగడ, మాధురి హరి, భాను లావణ్య అరసాడ, మహేష్ కుమార్, చిరంజీవి అఖిల అర్జుల లు తమ గాన మాధుర్యంతో ప్రేక్షకులను వినోదపరిచారు. మూడు గంట లకి పైగా జరిగిన ఈ కార్యక్రమంలో సింగర్స్ (Singers) సందడి చేసారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected