Connect with us

Movies

టాలీవుడ్‎ రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మరణం

Published

on

తెలుగు సినీ రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 11 ఆదివారం మరణించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు 82 ఏళ్ళ వయస్సులో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు తుదిశ్వాస విడిచారు.

1940 జనవరి 20న జన్మించిన కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు. ప్రముఖ హీరో ప్రభాస్ కు పెదనాన్న. కృష్ణంరాజుకు భార్య శ్యామలా దేవి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 1966 లో ‘చిలకా గోరింక’ చిత్రంతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసి 187కు పైగా చిత్రాల్లో నటించారు. కృష్ణంరాజు నంది అవార్డు, ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు గెలుచుకున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected