పెన్సిల్వేనియాలోని ఓక్స్ (Oaks, Pennsylvania) నగరంలో సెప్టెంబర్ 14, 2025న ఉత్తర అమెరికా తెలుగు సంఘం మిడ్-అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో 10వ వార్షిక మహిళల త్రోబాల్ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో దాదాపు 100 మందికి పైగా మహిళా క్రీడాకారిణులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
ఈ కార్యక్రమానికి తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కోడాలి (Naren Kodali), తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి, మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి (Phani Kanteti), బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని, కమ్యూనిటీ నాయకులు సతీష్ తుమ్మల, సతీష్ చుండ్రు, సునీల్ కోగంటి అతిథులుగా హాజరయ్యారు.
క్రీడల్లో మహిళలు ప్రదర్శిస్తున్న ప్రతిభను, ఉత్సాహాన్ని అభినందిస్తూ పాల్గొన్నవారిని ప్రోత్సహించారు. రంజిత్ మామిడి మరియు చలం పావులూరి ఈ త్రోబాల్ టోర్నమెంట్ (Throwball Tournament) ను పకడ్బందీగా నిర్వహించారు, వీరికి రిఫరీలు దీప్తి కోక మరియు చైతన్య కట్టా అద్భుతమైన సహకారం అందించారు.
యువ వాలంటీర్లు ధీరజ్ యలమంచి, శ్రుతి కోగంటి, ప్రణవ్ కంతేటి, నిహారిక కస్తూరి, యశస్వి ఆల మరియు మరికొంతమంది ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతికూల వాతావరణంలోనూ ఈ టోర్నమెంట్ విజయానికి అవిశ్రాంతంగా శ్రమించారు. వీరు కోర్ట్ ఏర్పాట్లు, లాజిస్టిక్స్ మరియు అంపైరింగ్ వంటి పనులను చూసుకున్నారు.
త్రోబాల్ టోర్నమెంట్ (Throwball Tournament) గ్రాండ్ స్పాన్సర్ అయిన వేణు సంగాని (స్ప్రూస్ ఇన్ఫర్మేషన్)కి నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. వారి ఉదార మద్దతుతోనే ఈ కార్యక్రమం విజయవంతమైంది.
ఈ టోర్నమెంట్ లో డ్రాగన్స్, ఈగిల్స్, థండర్ త్రోస్, పవర్ ఉమెన్, డిటౌన్ డాజ్లర్స్, స్ట్రైకర్స్, మావెరిక్స్, ఎక్స్టన్ ఆక్వాడ్, మరియు పవర్ గర్ల్స్ టీమ్‌ల మధ్య పోటీలు చాలా ఉత్సాహంగా జరిగాయి, ఇవి ఉల్లాసభరితమైన మరియు పోటీతత్వ వాతావరణాన్ని సృష్టించాయి.
విజేతలు
పవర్ ఉమెన్ టీమ్ సభ్యులు: కల్పన డొప్పలపూడి, దియా భార్గవ్, శ్రుతి అనంతరామన్, లీలా దొంతుకర్తి, చైతన్య నాగరాజు, సుధా వర్కూర్, దీప్తి పోల, లక్ష్మీ పూజా చిట్టూరి మరియు సుదర్శిని సంగలపోర్ వేణుగోపాల్.
రన్నరప్
డ్రాగన్స్ టీమ్ సభ్యులు: అను సౌందరరాజన్, నందిని జనార్థనన్, శేత్ర శాంతనం, మధు మగేష్, దివ్యతేజస్విని తిరుమలశెట్టి, రీష్మా దొమ్మరాజు, ప్రియా మోహన్, వైదేహి నాగిళ్ళ, అమృత సెంథిల్ కుమార్ మరియు గాయత్రి సబరీష్.
ముగింపు కార్యక్రమంలో డాక్టర్ నరేన్ కోడాలి, రవి పొట్లూరి (Ravi Potluri), ఫణి కంతేటి, వెంకట్ సింగు (Venkat Singu), సాయి బొల్లినేని మరియు మిడ్-అట్లాంటిక్ టీమ్ నాయకులు విజేతలకు, ఇతరులకు ట్రోఫీలు మరియు వాలంటీర్ సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ నరేన్ కోడాలి మాట్లాడుతూ.. క్రీడాకారుల మరియు వాలంటీర్ల అంకితభావం, క్రీడాస్ఫూర్తిని ప్రశంసించారు. రవి పొట్లూరి మాట్లాడుతూ.. క్రీడలు మరియు సేవ ద్వారా మహిళా సాధికారత (Women Empowerment), యువ నాయకత్వాన్ని పెంపొందించడం, కమ్యూనిటీ స్ఫూర్తిని బలోపేతం చేయడం తానా లక్ష్యమని నొక్కి చెప్పారు.
చివరన తానా మిడ్-అట్లాంటిక్ (TANA Mid-Atlantic Chapter) రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి మరియు ఇతర మిడ్ అట్లాంటిక్ తానా నాయకులు మహిళల త్రోబాల్ టోర్నమెంట్ ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.