India: ఓ దృశ్యం… రెండు ఆడపులుల గర్జనతో గంభీరంగా మారింది! ఇందాకా టీవీ న్యూస్ చూస్తుంటే… ఓ దృశ్యం హృదయాన్ని ఝళిపించింది. ఒక చిన్న క్షణమే కానీ, అది తలచుకుంటే ఇప్పటికీ గర్వంతో గుండె ఊపిరాడుతోంది.
పాకిస్తాన్ లోని టెర్రరిస్ట్ స్థావరాలపై భారత సైన్యం (Indian Army) గతరాత్రి నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)” గురించి రక్షణ శాఖ (Department of Defense) అత్యవసరంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ప్రెస్ మీట్ వేదికపై ముందు భద్రతా కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ (Vikram Mistry) గారు కూర్చున్నారు. అందరూ అతని మాటలు కోసం వేచి చూస్తున్నారు.
అయితే… అనూహ్యంగా వేదిక ఎడమ వైపు నుంచి ఇద్దరు యువ అధికారి ఆడపులులు చకచకా అడుగులు వేసుకుంటూ వేదికపైకి వచ్చారు. వాళ్ళ యూనిఫాం మెరిసింది… కళ్లల్లో మిన్నే మెరుపులు… కాళ్ళడుగున భూమి కూడా ధైర్యంతో కంపించినట్టనిపించింది!
వాళ్లే భారత సైన్యంలో తొలి మహిళా ఇంటెలిజెన్స్ ఆఫీసర్ – కల్నల్ సోఫియా ఖురేషి (Colonel Sophia Qureshi) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో స్క్వాడ్రన్ లీడర్ – వ్యోమికా సింగ్ (Vyomika Singh) వయసులో చిన్నవాళ్లే కానీ, మాట్లాడిన విధానం చూసినవారెవరికైనా – “ఇది యుద్ధం తర్వాత మరో శక్తివంతమైన దాడి!” అనిపించేదే.
వాళ్లు చెప్పిన ప్రతి అంశం… గాలిలో నుంచి దూసుకెళ్లిన మిరాజ్ (Mirage) – 2000 జెట్ వివరాలు, ఆ రాత్రి 2:47 కి ప్రారంభమైన ఆపరేషన్ సమయం, పాక్ ఎయిర్ డిఫెన్స్ ఎలా మోసపోయింది, గూఢచారుల సమాచారంతో లక్ష్యాలను ఎలా ఖచ్చితంగా ఎన్నుకున్నారు – అన్నీ గణాంకాలతో, స్పష్టతతో, గంభీరతతో చెప్పారు. ప్రెస్ మీట్ ఆడిటోరియం అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయింది.
మీడియా ప్రతినిధులందరూ ఊపిరి బిగపట్టి వాళ్లు చెప్పేది విన్నారు. వాళ్ల మాటల్లో దేశభక్తి మాత్రమే కాకుండా మహిళా శక్తికి జాతీయ గౌరవం ఎలా దక్కాలో తెలిసింది. అక్కడే తెలిసింది – ఇప్పుడు యుద్ధాన్ని ట్యాంకులు కాదు, తెలివితేటలు మేళవించిన మహిళలు గెలుస్తున్నారు. పాక్ టెర్రరిస్టుల గుండెల్లో ఈ రెండు ఆడపులుల గర్జన ఓ శబ్దాతీత బాంబులా పేలింది.
హాట్సాఫ్ టు వీరనారి
మీరు చెప్పిందే కాదు, మాతో మాట్లాడిన ప్రతీ క్షణం దేశం గర్వించేలా చేసింది. ఈ దృశ్యం ద్వారా మరోసారి భారత్ ప్రపంచానికి చెప్పారు: సైన్యంలో మహిళల ఉనికి ఓ శబ్దం కాదు… శక్తి! దేశ రక్షణలో మహిళలు – హద్దులు దాటి పోరాడే యోధులు!
– సురేష్ కరోతు