నవంబర్ 19: హైస్కూల్ విద్యార్థులలో ఆందోళన, ఒత్తిడి, మానసిక సంఘర్షణ తదితర అంశాలతో ‘ది ఎపిడెమిక్ ఆఫ్ యాంగ్జయిటీ ఇన్ టుడేస్ హైస్కూల్ స్టూడెంట్స్’ అంటూ తానా నిర్వహించిన కార్యక్రమం విజయవంతంగా జరిగింది. నవంబర్ 19న నిర్వహించిన ఈ కార్యక్రమంలో డా. మణి పావులూరి తల్లిదండ్రులతో ఘర్షణ, పోటీ పాఠశాల జీవితం, తోటివారి ఒత్తిడి, బెదిరింపు మరియు ఆందోళనను ఎలా గుర్తించాలి మరియు పిల్లలకి తల్లి దండ్రులు ఎలా సహకరించాలి అని కార్యక్రమానికి హాజరైన తల్లిదండ్రులతో విపులంగా చర్చింటమే కాకుండా తల్లిదండ్రులకి ఉన్న పలు సందేహాల్ని నివృత్తి చేసారు.
ఈ కార్యక్రమ వక్త డా. మణి పావులూరి తమ విలువైన సమయాన్ని కేటాయించినందుకుగాను అలాగే తాను చేసే ప్రతి కార్యక్రమాన్ని ఎంతో ప్రోత్సాహంతో పాటు తన విలువైన సలహాలు సూచనలు అందచేస్తున్న తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు కి నిర్వాహకులు తానా ఉమెన్స్ సర్వీసెస్ కోఆర్డినేటర్ డా. ఉమా ఆరమండ్ల కటికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రోత్సాహంతో భవిష్యత్తులో మరెన్నో కార్యక్రమాలు చేస్తాం అన్నారు.
ఈ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన రాజా కసుకుర్తి (కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్), శ్రీనివాస్ కూకట్ల (ఈవెంట్స్ కోఆర్డినేటర్), శశిధర్ జాస్తి (తానా కేర్స్ చైర్) మరియు తానా నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమం ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలా ఉపయోగకరం అని ఇలాంటి కార్యక్రమం నిర్వహించిన తానా వారికి పాల్గొన్నవారందరూ అభినందనలు తెలిపారు.