తెలుగు మేధస్సుకి ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చి తెలుగు టెకీలు రాష్ట్రానికి, దేశానికి అంబాసిడర్లుగా మారటంలో క్రియాశీల పాత్ర పోషించిన నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుని UK వ్యాప్తంగా వున్న తెలుగు వాళ్ళందరూ ముక్తకంఠంతో ఖండిస్తూ, బాబు గారికి మద్దతుగా ఈ రోజు వివిధ ప్రాంతాల్లో తమ సంఘీభావాన్ని ప్రదర్శించారు.
లక్షలాది పేద, మధ్య తరగతి కుటంబాల పిల్లలు ఇవ్వాల ప్రపంచ నలుమూలలకు వెళ్లి వివిధ రంగాల్లో స్థిరపడి తమ మేధస్సుకి తగ్గ గుర్తింపు సాధిస్తున్నారు అంటే CBN గారు నాడు ముందుచూపుత్తో తీసుకువచ్చిన ఆర్ధిక,పాలనా సంస్కరణలు, సాధించిన పెట్టుబడులు,ఆకర్షించిన కంపెనీలు & యువతకి ఒక ముఖ్యమంత్రిగా అయన ఇచ్చిన స్ఫూర్తి తోనే సాధ్యమైందని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
మా ముందు తరాల్లో ఎందరో మేధావులు, నిష్ణాతులు పుట్టినా వారికి మాకు వచ్చినన్ని అవకాశాలు రాలేదంటే కారణం ఆరోజు బాబు గారి స్థాయిలో వ్యవస్థల్ని సరళీకరించి భవిషత్తు ప్రణాళికలని Knowledge Based Economy దిశగా నడపకపోవటం వల్లనే. ప్రపంచంలో మరే దేశంలోనూ ఇంత తక్కవ సమయంలో ఇన్ని లక్షల మంది Energetic Youth Equipped with Right Skills మార్కెట్ అవసరళాకి అనుగుణంగా అందుబాటులోకి వచ్చినట్టు ఎక్కడా లేదని, ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు, కంపెనీలు, సంస్థలు Skill Skill Skill అని నెత్తీ నోరూ బాదుకుంటూ లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నా ఇంకా Skill Gap వుండి తమ తమ ప్రాజెక్టుల్లోకి అవసరమైన నిపుణులు దొరక్క పడుతున్న ఇబ్బందిని పంచుకున్నారు.
కేవలం 370 కోట్ల రాష్ట్ర ప్రభుయిత్వా నిధులతో సుమారు మూడు లక్షల మంది విద్యార్థుల్ని ట్రైన్ చేయటమే కాకుండా అందులో 70,000 మందికి వివిధ కంపెనీల్లో ఉపాధి దొరికేలా చేయటమే కాకుండా ఇప్పటికీ ఆ Skill Development Centres & Equipment వాడుకలో ఉండి ఆయా కాలేజీలు, సంస్థలు, విద్యార్థులు వాటి నుంచి శిక్షణ పొందుతుంటే ఇంకెక్కడ Scam అని ఈ సందర్భంగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇలాంటి రాజకీయ ప్రేరేపిత కక్షపూరిత కుట్రలతో ఒక జాతి ఆలోచనా తీరుని ప్రభావితం చేసిన మహనీయున్ని కేవలం పేద వాడి పిల్లలకి శిక్షణ ఇచ్చినందుకు శిక్షిస్తే సమాజం చూస్తూ ఊరుకోదని, ప్రజలు పాలకుల మీద తిరగబడితే ఫలితాలు తీవ్రంగా వుంటాయని తెలియచేశారు. 42 ఏళ్ళు ఎంతో కష్టపడి క్రమశిక్షణతో బాబు గారి నిర్మించుకున్న Character & Integrity మీద ఈరోజు 37 కేసుల్లో ప్రధాన ముద్దాయిగా ఉండి, జైలు జీవితం అనుభవించిన ఒక వ్యక్తి ఇలా బురదజల్లటం నీచం అని, దీని వల్ల రాజకీయాలు అంటేనే కుళ్ళు, కంపు అని అది కేవలం రౌడీలు, కబ్జాకోరుల కోసమే తప్ప సమాజం కోసం ఆలోచించి పనిచేసేవాళ్ళకి కాదేమో అని తప్పుడు అభిప్రాయం యువతలో ఏర్పడే ప్రమాదం ఉందని వక్తలు పేర్కొన్నారు.
ఎన్నడూ గడప దాటని మహిళలు సైతం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద స్థాయిలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బాబు గారికి మద్దతు తెలియచేయటం ఆయన Credibility కి నిదర్శనం అని, ప్రజాగ్రహం ముందు ఎంతటి నియంతలైనా తల వంచాల్సిందేనని తెలియచేసారు. శాంతి మంత్రంతో దేశాన్ని ఏకతాటి మీద నడిపి దేశానికి స్వేచ్చావాయువులు ప్రసాదించిన గాంధీ మహాత్ముడు కొలువై వున్న బ్రిటన్ పార్లమెంటు సాక్షిగా UK వ్యాప్తంగా వున్న వివిధ తెలుగు సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆంధ్ర ప్రభుత్వానికి నిరసన ప్రదర్శన చేస్తూ బాబు గారు ఈ అక్రమ కేసుల నుంచి త్వరగా బయటపడి ప్రజల మద్దతుతో మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షించారు.