మల్లేశం సినిమా దర్శకులు రాజ్ రాచకొండ (Raj Rachakonda) దర్శకత్వంలో 23 అంటూ మరో తెలుగు సినిమా ఈరోజు మే 15న రిలీజ్ అయ్యింది. మల్లేశం సూపర్ హిట్ అవ్వడం, అదే డైరెక్టర్ ఈ ఇరవై మూడు సినిమా డైరెక్ట్ చెయ్యడంతో అంచనాలు పెరిగాయి.
అమెరికా మొత్తం మీద వివిధ రాష్ట్రాలలోని 100 కి పైగా సినిమా థియేటర్స్ (Movie Theaters) లో 23 సినిమా రిలీజ్ అవ్వడం విశేషం. థియేటర్స్ లిస్ట్ కోసం పై ఫ్లయర్ చూడండి. ఇన్ఫినిటమ్ మీడియా (Infinitum Media) ఈ సినిమాని మనందరి ముందుకి తెస్తుంది.
మంచి గ్రిప్పింగ్ కథతో All are equal but some are more equal అంటూ Inspired by True Events టాగ్ లైన్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇండియన్ ప్రీమియర్స్ లో కూడా మంచి టాక్ తెచ్చుకోవడంతో చిన్న సినిమా అయినప్పటికీ అందరికీ అంచనాలు పెరిగాయి.