తెలుగుదేశం పార్టీ ఎన్నారై టీడీపీ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ల నియామకం చేపట్టింది. మొదటినుంచి తెలుగుదేశం పార్టీకి ప్రవాసులలో మంచి పట్టు ఉన్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు నార్త్ అమెరికా మరియు గల్ఫ్ దేశాలలో ఎన్నారై టీడీపీ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్లను నియమించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం అమెరికాలో ఎన్నారై టీడీపీ లో మొదటినుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తున్న అట్లాంటా కి చెందిన మల్లిక్ మేదరమెట్ల ను నార్త్ అమెరికా రీజియన్ కి ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ గా నియమించారు.
Mallik Medarametla
అలాగే గల్ఫ్ దేశాలైన కువైట్, ఖతార్, ఒమన్, బహ్రెయిన్ లకు సుధాకర్ కుదరవల్లి మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా లకు తులసి కుమార్ ముక్కు లను నియమించారు. ఈ సందర్భంగా ముగ్గురికీ పలువురు ఎన్నారైలు అభినందనలు తెలిపారు.
You must be logged in to post a comment Login