డాలస్/ఫోర్ట్ వర్త్, అక్టోబర్ 28, 2022: అమెరికాలో సాహిత్య, సంగీత సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేసి, ఆధునికతను మేళవించి తెలుగు మనసులను రంజింపచేస్తున్న టాంటెక్స్ (Telugu Association of North Texas) సంస్థ అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి, పాలక మండల అధిపతి వెంకట్ ములుకుట్ల గారి అధ్యక్షతన డాలస్ లో అక్టోబర్ 28వ తేదీన అలెన్ క్రెడిట్ యూనియన్ సెంటర్ లో టాంటెక్స్ దీపావళి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.
ఈ టాంటెక్స్ (TANTEX) కార్యక్రమంలో భాగంగా సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ (SS Thaman) గారి సంగీత బృందం శివమణి, నవీన్ కుమార్, మనీషా ఈరబతిని, పృధ్వీ చంద్ర, రమ్య బెహ్రా, శ్రీ కృష్ణ, శ్రీ సౌమ్య, శృతి రంజని, సాకేత్ కొమండూరి, హారిక నారాయణ్ నూతనోత్సాహంతో ప్రేక్షకులని మరింత ఉత్తేజ పరిచారు.
గాయనీగాయకులు సంగీత విభావరితో హై వోల్టేజ్ మరియు ఎనర్జిటిక్, నాన్ స్టాప్ పాటలతో కచేరీ నాన్ స్టాప్ గా 3 గంటల పాటు సాగింది. విచ్చేసిన గాయనీగాయకులను అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి (Uma Mahesh Parnapalli) గారు మరియు కార్యవర్గ సభ్యులు పుష్పగుచ్చము, జ్ఞాపిక మరియు శాలువా తో సత్కరించారు.
1986 లో ప్రారంభమైన టాంటెక్స్ సంస్ధ సంవత్సరం పొడుగునా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఏకైక సంస్థ మన టాంటెక్స్ అని సగర్వంగా తెలియజేశారు. 2022 సంవత్సరపు పోషక దాతల నందరిని అధ్యక్షులు ఉమా మహేష్ పార్నపల్లి గారు మరియు మిగతా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రకటించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన మరియు ప్రసార మాధ్యమాలైన టీవీ9, టీవీ5, సాక్షి, ఐఏసియా టివి, రేడియో కారవాన్, ఈనాడు, ఆంధ్ర జ్యోతి, తెలుగు టైమ్స్, NRI2NRI.COM, TNI Live లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియ చేయటంతో శోభాయమానంగా నిర్వహించిన దీపావళి వేడుకలకి తెరపడింది.