Connect with us

Associations

Bahamas: 43 ఏళ్ళ TAMA చరిత్రలో మొదటి క్రూజ్ విహార యాత్ర, మధురానుభూతులను మిగిల్చిన వైనం

Published

on

. వారం రోజులపాటు చక్కని అనుభూతి
. కలిసొచ్చిన ఫోర్సైత్ కౌంటీ ఫాల్ బ్రేక్
. 55 కుటుంబాలు (225 మంది) పాల్గొన్న వైనం
. మన్ననలు పొందిన తెలుగు వంటకాల ఘుమఘుమలు
. అట్లాంటా అయినా అట్లాంటిక్ ఓషన్ అయినా సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట

. 43 ఏళ్ళ TAMA చరిత్రలో మొట్టమొదటి క్రూజ్ విహారయాత్ర
. ఐలాండ్స్, బీచ్లు, షాపింగ్, సిటీ టూర్స్, కిడ్స్ క్లబ్, వాటర్ స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు, బాలీవుడ్ డీజే నైట్
. అందరికీ తామా క్రూజ్ ప్రత్యేక టీషర్ట్స్
. బహామాస్ క్రూజ్ విహారయాత్ర సూపర్
. హరికేన్ హెలీన్ వల్ల ఒక రోజు ఆలస్యంగా రాక

అట్లాంటా తెలుగు సంఘం (TAMA) మొట్టమొదటి సారి నిర్వహించిన క్రూజ్ (Cruise) విహారయాత్ర ఎన్నో మధురానుభూతులను మిగిల్చింది. తామా 2024 అధ్యక్షులు సురేష్ బండారు (Suresh Bandaru) సారధ్యంలోని కార్యవర్గం వినూత్నంగా ఏర్పాటుచేసిన బహామాస్ (Bahamas) క్రూజ్ విహారయాత్రలో సుమారు 225 (55 Families) మంది పెద్దలు, పిల్లలు, మహిళలు పాల్గొన్నారు.

తామా 2024 కార్యవర్గ మరియు బోర్డు సభ్యుల ఫ్రెండ్లీ సెండ్ ఆఫ్ తో సెప్టెంబర్ 21 శనివారం రాత్రి రెండు బస్సులలో ఫ్లోరిడా (Florida) రాష్ట్రం, ఓర్లాండో (Orlando) నగరంలోని పోర్ట్ కానవేరల్ (Port Canaveral) కి బయలుదేరారు. మరికొంతమంది తమకు తాము డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. సెప్టెంబర్ 22 ఆదివారం రోజున MSC Seashore Cruise Ship ఎక్కారు.

ముందుగా అట్లాంటిక్ మహాసముద్రం (Atlantic Ocean) లోని ఓషన్ కే ఐలాండ్ (Ocean Cay Island), ఆ తర్వాత బహామాస్ (Bahamas) ఐలాండ్ రాజధాని నాసావ్ (Nassau) నగరం, బీచ్లు, షాపింగ్, సిటీ టూర్స్, కిడ్స్ క్లబ్, డాన్స్ షోస్, వాటర్ స్పోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs), ఎక్సక్లూసివ్ బాలీవుడ్ డీజే నైట్ ఇలా ప్రతి ఒక్క యాక్టీవిటీని అందరూ ఆస్వాదించారు.

ఇక తామా (Telugu Association of Metro Atlanta – TAMA) గ్రూప్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తెలుగు వంటకాలు అమోఘం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం మరియు రాత్రి భోజనాలలో ఇటు ఇండియన్ వెజ్ అటు నాన్వెజ్ ఐటమ్స్ ప్లాన్ చేసిన తామా జట్టు (TAMA Team) ని తప్పక అభినందించాల్సిందే.

క్రూజ్ (Cruise) లో ఉన్న ఇతర ఇండియన్స్ సైతం తామా గ్రూప్ (TAMA Group) కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వంటకాలను ఆరగించి కృతజ్ఞతలు తెలపడం విశేషం. మధ్యలో హరికేన్ హెలీన్ (Hurricane Helene) వల్ల ముందుగా అనుకున్నదానికంటే ఒక రోజు ఎక్కువ క్రూజ్ లో గడపాల్సి వచ్చింది.

జార్జియా (Georgia) రాష్ట్రంలో తెలుగువారు ఎక్కువగా ఉండే ఫోర్సైత్ కౌంటీ ఫాల్ బ్రేక్ (Forsyth County Fall Break) ని ఉపయోగించుకొని మొత్తంగా గత శనివారం రాత్రి నుంచి శుక్రవారం రాత్రి వరకు ఒక వారం పాటు సాగిన ఈ క్రూజ్ విహారయాత్ర (Cruise Trip) అందరి మన్ననలు పొందింది.

అందరికీ 11, 12 డెక్స్ లో కేబిన్స్ ఒక చోటే ఉండేలా రిజర్వ్ చేశారు. బస్సు ప్రయాణంలో కూడా చక్కని భోజన ఏర్పాట్లు (Food Arrangements) చేయడం తామా కే చెల్లింది. ఒక రోజు తామా కి ప్రత్యేకంగా కేటాయించిన ఈవెంట్ హాల్లో మీట్ అండ్ గ్రీట్, సాంస్కృతిక కార్యక్రమాలు, బింగో వంటి ఫన్ గేమ్స్ మరియు బాలీవుడ్ డీజే నైట్ నిర్వహించారు.

నీళ్లలో తేలియాడుతున్న షిప్ లో మనవాళ్లు డాన్సులతో ఊగడం ఒకింత కొత్తగా అనిపించింది. తామా అధ్యక్షులు సురేష్ బండారు తోపాటు ఈ క్రూజ్ విహార యాత్రలో పాల్గొన్న తామా (TAMA) కార్యవర్గ సభ్యులు సునీల్ దేవరపల్లి, ప్రియాంక గడ్డం, చందు బచ్చు మరియు అట్లాంటా వాసి లక్ష్మి మండవల్లి తదితరుల సహకారం మరియు సమన్వయం మరువలేనిది.

ప్రతి రోజూ ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎంతో ఓపికతో వివరాలు అందించడం తోపాటు, క్రూజ్ టికెట్స్ బుక్ చేయడం దగ్గిర నుంచి పాస్పోర్ట్, వీసా, లగేజీ, ఫుడ్ వంటి విషయాలలో ప్రతిదీ ఎప్పటికప్పుడు డిటైల్డ్ గా ప్లాన్ చేయడం తామా అధ్యక్షులు (TAMA President) సురేష్ బండారు (Suresh Bandaru) నాయకత్వ ప్రతిభను చాటింది. బీచుల్లో అందరూ సరదాగా గడిపారు.

తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) వారి ప్రత్యేక టీషర్ట్స్ తో అందరూ ఫోటోలు దిగారు. రెగ్యులర్ డీజే నైట్ లో కూడా ఫ్యాన్స్ కోరిక మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) నటించిన ఖుషీ సినిమాలోని పాట మరియు హిందీ బాంగ్రా పాట ప్లే చేయడంతో డాన్స్ ఫ్లోర్ (Dance Floor) మనవాళ్ళ స్టెప్పులతో అదిరింది.

బహామాస్ కరీబియన్ క్రూజ్ విహారయాత్ర (The Bahamas Caribbean Cruise Trip) జీవితాంతం గుర్తు ఉంటుందంటూ పాల్గొన్నవారు ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. కమ్మింగ్, ఆల్ఫారెటా, సువానీ, జాన్స్ క్రీక్ వంటి నగరాల నుంచే కాకుండా, అట్లాంటా (Atlanta) కి సుమారు గంట ప్రయాణం ఉన్న డగ్లస్విల్ నుంచి కూడా ఈ తామా క్రూజ్ విహారయాత్ర లో పాల్గొని ఆనందంగా గడిపారు.

సుమారు 3 నెలల పాటు ప్లాన్ చేసి, బస్సులు, ఇండియన్ ఫుడ్, ఫన్ యాక్టివిటీస్, బడ్జెట్ ఇలా ప్రతిదీ పక్కాగా ప్రణాళిక రచించుకొని తామా (Telugu Association of Metro Atlanta – TAMA) అధ్యక్షులు సురేష్ బండారు తన కార్యవర్గ జట్టుతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం వల్లనే ఇంతటి పెద్ద క్రూజ్ విహారయాత్ర విజయవంతమైంది.

error: NRI2NRI.COM copyright content is protected