Connect with us

Associations

TAMA 2025: రుపేంద్ర వేములపల్లి & రాఘవ తడవర్తి సారధ్యంలో ఛార్జ్ తీసుకున్న నాయకత్వం

Published

on

అట్లాంటా తెలుగు సంఘం (TAMA) 2025 లీడర్షిప్ సభ్యులు జనవరి 1 నుంచి ఛార్జ్ తీసుకున్నారు. తామా అధ్యక్షులు రుపేంద్ర వేములపల్లి (Rupendra Vemulapalli) సారధ్యంలోని కార్యవర్గ సభ్యులు మరియు తామా బోర్డు ఛైర్మన్ రాఘవ తడవర్తి (Raghava Tadavarthi) సారధ్యంలోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అట్లాంటా వాసులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

మొత్తం 13 మంది సభ్యులున్న 2025 తామా (Telugu Association of Metro Atlanta) కార్యవర్గానికి, అలాగే 11 మంది సభ్యులున్న తామా బోర్డు (TAMA Board) కి NRI2NRI.COM తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వీరి అందరి వివరాలు ఫ్లయర్స్ లో చూడవచ్చు.

44 వ సంవత్సరంలోకి అడుగెడిన ఈ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (Telugu Association of Metro Atlanta – TAMA) కార్యక్రమాలు జనవరి 18 శనివారం రోజున ఆల్ఫారెటా (Alpharetta, Georgia) లోని దేశాన మిడిల్ స్కూల్లో (Desana Middle School) సంక్రాంతి సంబరాలతో ప్రారంభం అవనున్నాయి.

error: NRI2NRI.COM copyright content is protected