Connect with us

Festivals

జాక్సన్విల్ తెలుగు సంఘం దసరా బతుకమ్మ సంబరాలు అక్టోబర్ 2న

Published

on

జాక్సన్విల్ తెలుగు సంఘం (Telugu Association of Jacksonville Area) దసరా బతుకమ్మ సంబరాలు అక్టోబర్ 2 ఆదివారం రోజున ఘనంగా నిర్వహిస్తున్నారు. ఫ్లోరిడా రాష్ట్రం, జాక్సన్విల్ నగరంలోని స్థానిక గ్రీన్లాండ్ పైన్స్ ప్రాధమిక పాఠశాలలో ఈ సంబరాలు మధ్యాహ్నం 4 గంటల నుండి రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు పండుగ వాతావరణంలో నిర్వహించనున్నారు.

క్రియేటివ్ బతుకమ్మలు చేసిన వారికి మరియు పిల్లలకు ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగ ప్రత్యేక భోజనం హైలైట్స్. సుమన్ సజ్జన రూపొందించిన వీడియో ప్రోమో చూస్తుంటే ఈ సంబరాలు అంబరాన్నంటేలా ఉన్నాయి. టికెట్స్ తదితర వివరాలకు క్రింది ఫ్లయర్ చూడండి. 8 గంటల నుండి భోజనాలు సర్వ్ చేయబడును.

సురేష్ మిట్టపల్లి అధ్యక్షతన తెలుగు అసోసియేషన్ ఆఫ్ జాక్సన్విల్ ఏరియా ‘తాజా’ కార్యవర్గ సభ్యులు మరియు ఈవెంట్ చైర్స్ శృతిక మాదాడి, వినయ యాడ, శ్రీకన్య సత్యవరపు ఘనంగా నిర్వహించనున్న ఈ దసరా బతుకమ్మ సంబరాలలో నార్త్ఈస్ట్ ఫ్లోరిడాలో ఉన్న తెలుగువారు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected