Connect with us

Concert

TAGCA @ Charlotte: కోటి, ఆలీ, ఉదయ భాను & Musical Concert తో ఏప్రిల్ 20న ఉగాది సంబరాలు

Published

on

నార్త్ కరోలినా లోని షార్లెట్ (Charlotte) నగరం 2024 ఉగాది సంబరాలు అత్యంత ఘనంగా జరుపుకోవడానికి సిద్దమవుతుంది. ఈ ఉగాది పండుగ సంబరాలను తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చార్లెట్ ఏరియా (Telugu Association of Greater Charlotte Area) వారు ఈ శనివారం ఏప్రిల్ 20న నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవటానికి మన వెటరన్ సంగీత దర్శకులు కోటి (Koti), మన ప్రఖ్యాత హాస్య నటులు ఆలీ (Ali) గారు, మన తెలుగింటి ఆడపడుచు ప్రముఖ వాక్యత ఉదయ భాను (Anchor Udaya Bhanu) గారు, ప్రముఖ గాయని గాయకులూ అంజనా సౌమ్య, అనుదీప్, సందీప్ మరియు సౌజన్య భాగవతుల విచ్చేసి మనందరినీ వారి గానాలతో అలరించబోతున్నారు.

ఈ సంబరాలను జరుపుకోడానికి ఓవెన్స్ థియేటర్ (Ovens Auditorium) ఎన్నో హంగులతో సమాయత్తమవుతుంది. ఘనమైన అలంకరణలు, డిజిటల్ స్క్రీన్స్ (Digital Screens) వీటిలో భాగం కానున్నాయి. అంతే అనుకుంటే పొరపాటే, ఎన్నో ఆసక్తికర బహుమతులు బంగారు నాణేలు, బంగారు గొలుసు, పట్టు చీరలు, రాఫెల్స్ (Raffle Prizes) లో భాగంగా మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయి.

ఇంకెందుకు ఆలస్యం! వెంటనే మీ టికెట్స్ www.NRI2NRI.com/TAGCA Ugadi 2024 లో రిజర్వ్ చేసుకోండి. షార్లెట్ (Charlotte) మరియు చుట్టుపక్కలున్న అందరికీ తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చార్లెట్ ఏరియా (TAGCA) కార్యవర్గ సభ్యులు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు. మరిన్ని వివరాలకు ఫ్లయర్ లో ఉన్న ఫోన్ నంబర్స్ ని సంప్రదించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected