నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) డల్లాస్‌లో మహిళా సంబరాలు నిర్వహించింది. నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాలకు తెలుగు మహిళలు దాదాపు 300 మందికి పైగా హాజరయ్యారు. ఈ సారి మహిళా సంబరాల్లో ప్రత్యేకంగా నిర్వహించిన తెలుగు అమ్మాయి కార్యక్రమం అందరిని విశేషంగా ఆకట్టుకుంది.
ఫ్రిస్కో (Frisco) నగరంలోని వాన్డెర్వెంటెర్ మిడిల్ స్కూల్లో జరిగిన ఈ మహిళా సంబరాల్లో శాస్త్రీయ నృత్యం, జానపద, సినిమా నృత్యం, మెహిందీ, రీల్స్ పోటీలు, మ్యూజికల్ ఛైర్స్ వంటి ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా తెలుగమ్మాయి పోటీల్లో మన తెలుగు భాష, యాస, కట్టు, బొట్టుని ప్రదర్శిస్తూ అనేక మంది ముద్దుగుమ్మలు, కిన్నెరసానులు, కావ్యనాయికలు విభాగాల కింద ఎంతో మంది మహిళలు పోటీపడ్డారు.
నాట్స్ (NATS) తెలుగమ్మాయి ప్రిలిమ్స్ కోసం డల్లాస్‌లో చాలామంది మేముసైతం అని ముందుకు రావడంతో ఆద్యంతం ఈ కార్యక్రమం కన్నులపండుగగా సాగింది. మహిళా సంబరాల వేదిక మీద అమెరికా అండర్ 19 క్రికెట్ (Cricket) టీమ్ లో ఎన్నికయిన సాయి తన్మయి ఈయున్నిని నాట్స్ అధ్యక్షులు బాపయ్య చౌదరి (బాపు) నూతి సత్కరించారు.
సాయి తన్మయి తోపాటు మన తెలుగు కమ్యూనిటీకి డీఎఫ్‌డబ్ల్యూ (Dallas Fort Worth) ప్రాంతంలో స్వచ్చంద సేవలందిస్తున్న మహిళలను కూడా గుర్తించి, వారిని సేవా పురస్కారాలతో నాట్స్ నాయకులు సన్మానించారు. నాట్స్ సేవా పురస్కారాలు అందుకున్న వారిలో సామాజిక కార్యకర్త డాక్టర్ భానుమతి ఇవటూరి, ప్రముఖ న్యాయవాది గీత దమన్న, ప్రముఖ యోగా శిక్షకురాలు మైత్రేయి ఇడపలపాటి ఉన్నారు.
మహిళలకు, యువతకు మరింత ప్రాధాన్యత ఇస్తూ మహిళా, యువ వేదికలను ఏర్పాటుచేసి ఇలాంటి అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నామని నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి అన్నారు. “భాషే రమ్యం – సేవే గమ్యం” అనే నాట్స్ నినాదానికి అనుగుణంగా భాషకి, సేవకి సమ ప్రాధాన్యాన్ని ఇస్తూ అనేక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అమెరికాతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి బాపు నూతి (Bapaiah Chowdary Nuthi) వివరించారు.
ఈ మహిళా సంబరాలను విజయవంతం చేయడంలో నాట్స్ జాతీయ మహిళా సమన్వయకర్త కవిత దొడ్డ, డల్లాస్ మహిళా సమన్వయకర్త స్వప్న కాట్రగడ్డ, జాతీయ సంయుక్త కార్యదర్శి జ్యోతి వనం, వీణ యలమంచిలి, ఆర్య బెల్లం, వనజ ఏపూరి, సందీప, లక్ష్మి కోటపాటి, రేవతి మిమ్మనేని, రాధికా న్యాలమడుగుల, యువ విభాగ సభ్యులు నిఖిత దాస్తి, యాషిత చుండూరు, మృదుల ముమ్మనేని, దక్ష మిటాపురం ఉన్నారు.
అలాగే నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరక్టర్ రాజేంద్ర మాదాల, డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్స్ సత్య శ్రీరామేనని, రవి తాండ్ర, జోనల్ వైస్ ప్రెసిడెంట్ డీవీ ప్రసాద్, డల్లాస్ చాప్టర్ సభ్యులు రవీంద్ర చుండూరు, పార్థ బొత్స, తేజ వేసంగి, నాగిరెడ్డి మందల, రవీంద్ర చిట్టూరి, శ్రీనివాస్ ఉరవకొండ, శ్రీధర్ విన్నమూరి, రవి తుపురాని తదితరులు తోడ్పడ్డారు. వీరందరిని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి (Aruna Ganti) ప్రత్యేకంగా అభినందించారు. తెలుగమ్మాయి కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
నాట్స్ తెలుగు సంబరాల్లో తెలుగమ్మాయి ఫైనల్స్
తెలుగమ్మాయి ప్రిలిమ్స్‌లో మొదటి మూడు స్థానాలలో గెలిచిన ఫైనలిస్టులు మే 26-28 తేదీలలో జరిగే నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు 2023 వేదిక మీద జరిగే ఫైనల్స్‌లో ఇతర నాట్స్ చాఫ్టర్లు నుండి వచ్చిన ఫైనలిస్ట్‌లతో పోటీ పడతారు. ఈ ఫైనల్స్ లో గెలిచిన వారికి ప్రతి కేటగిరిలో మిస్ నాట్స్ (NATS) కిరీటంతో పాటు నగదు బహుమతులు ఇవ్వబడతాయి.
నాట్స్ తెలుగమ్మాయి పోటీల్లో ఫైనలిస్టుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
నాట్స్ తెలుగు అమ్మాయి ఫైనలిస్టులు:
• ముద్దుగుమ్మ – వరుని శరను, తన్మయి జంగిడి, లోహిత్య సోము & యషిత చుండూరు
• కిన్నెరసాని – అలేఖ్య యకమా & మోహన గ్రీష్మ గుదిమెళ్ళ
• కావ్యనాయిక – మైత్రేయి మియాపురం, పెరిన్ దేవి బెహరా & శ్రీలత బెల్దే
నాట్స్ (NATS) తెలుగమ్మాయి విజేతలకు మొదటి బహుమతి $2500, రెండవ బహుమతి $1500, మూడవ బహుమతి $1000 నాట్స్ అమెరికా తెలుగు సంబరాల వేదికపై ఇవ్వడం జరుగుతుంది. మహిళా సంబరాలకు పసందైన భోజనం అందించిన స్వాగత్ బిర్యానీస్ ఇండియన్ క్యూసిన్ వారికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేశారు.
అంతేకాక ఈ కార్యక్రమానికి చేయూతనందించిన దాతలు స్వాగత్ బిర్యానీస్, ఫార్మ్2కుక్, కోపెల్ చెస్ క్లబ్, సేజ్ ఐటీ, వైకుంఠ్ డెవెలపెర్స్, ఏజెనిక్స్ ఫార్మస్యూటికల్స్, క్లౌడ్ జెనిక్స్, హింద్ సైట్, ఆర్కా చిల్డ్రన్స్ అకాడమీ, ప్రసూనా’స్ కిచెన్, ఔర్ ప్లేస్ రెస్టారెంట్ వారిని ఈవెంట్ కోఆర్డినేటర్స్ కవిత దొడ్డ, స్వప్న కాట్రగడ్డ, జ్యోతి వనం మరియు వీణ యలమంచిలి, చాప్టర్ కోఆర్డినేటర్స్ సత్య శ్రీరామినేని, రవి తాండ్రలు కృతజ్ఞతలు తెలియచేశారు.