జీవితంలో మొదటిసారిగా మాట్లాడేందుకు ఇబ్బంది పడుతున్నాను అంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. తెల్లవారితే గురువారం అనే సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఒకింత సెంటిమెంటల్గా మాట్లాడారు. పిల్లలు సక్సెస్ అయితే తల్లిదండ్రులు ఎలా ఫీలవుతారో నా తమ్ముళ్లు సింహా, భైరవ సాధించిన విజయాలకు మాటలు సరిపోవడం లేదు. ఫ్యూచర్ లో అభయ్, భార్గవ్ గురించి మాట్లాడాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఇప్పుడు తెలుస్తోంది. ఈ సినిమా హిట్ అవ్వాలి, దర్శకుడికి సక్సెస్ రావాలి మరియు ఈ సినిమాకు పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు రాజమౌళి కూడా పాల్గొన్నారు.