Connect with us

News

Picnic: వేసవి వేడిని విస్మరించేలా TDF Atlanta చెట్ల కింద వంట

Published

on

కుటుంబ ఆత్మీయతను చవిచూపేలా, వేసవి వేడిని విస్మరించేలా శుభప్రదంగా మరియు జయప్రదంగా Telangana Development Forum (TDF) Atlanta Chapter 2023 చెట్ల కింద వంట కార్యక్రమం అనూహ్య మన్ననలందుకున్నది.

స్వచ్ఛంద సహకార గుణం నేపథ్యంగా, సమైక్య కృషి తమ బలంగా ఆద్యంతం అబ్బురపరిచే స్నేహపూర్వక పరామరిక అందిస్తూ విచ్చేసిన తెలుగు అతిథులందరి చేతా భళా అని ప్రశంసలందుకున్న TDF కార్యవర్గం నిర్వహణ పటిమ ఆదర్శప్రాయం.

చిరునవ్వుల ఆహ్వానం పలుకుతూ ఆత్మీయ తీగతో అనూహ్య పరిమళాల నూతన అనుబంధాలను అల్లి చిరకాల మధురానుభూతులకు వేదికగా గత ఏడు సంవత్సరాలుగా తెలుగువారిని అలరించే TDF Atlanta వారి చెట్ల కింద వంట కార్యక్రమం ఈ ఏడాది జులై 22, 2023 న Buford Dam Road నందున్న సరస్సు ఒడ్డున నిర్వహించబడింది.

అసమాన ఆటంకాలను అధిగమిస్తూ, రూపకల్పనను మొదలుకొని అద్భుత నిర్వహణ వరకు అకుంఠిత సంకల్పంతో అవిశ్రాంత కృషితో దోషరహిత సేవలను అందించారు TDF సంస్థ Board of Trustee స్వాతి సుదిని, Core Team సభ్యులు మరియు స్వచ్ఛంద సహకార కార్యవర్గం.

ఐకమత్యం పరంపరగా, నిస్వార్థ సేవ ఆనవాయితీ గా ఎన్నో అద్భుత కార్యక్రమాలను నిర్వహిస్తున్న TDF Atlanta కు చేయూతగా నిలిచి తమవంతు సహకారాన్ని అందించిన పలు సంస్థల అధినేతలు మరియు కార్యవర్గం మరింత సందడ్లను చేకూర్చారు.

నలభీములను తలపిస్తూ, మాతృ స్పర్శను స్రృశింపచేస్తూ అడిగిన వారికి లేదనకుండా సుమారు 25 రకాల శాఖాహార/మాంసాహార వంటకాలతో, విందు భోజనం కొసరి వడ్డించిన ఘనత TDF సొంతం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అమోఘమైన విందు తరువాత DJ Durgam నిర్వహించిన ఫ్యామిలీ అంత్యాక్షరి అందరినీ ఎంతగానో అలరించింది. అతిథులను ఆటపాటల్లో అలువనీయకుండా కమ్మని నిమ్మరసం, నోరూరించే మిరపకాయ బజ్జీలతో సాయంకాలం వరకూ అభిమానపూర్వకంగా అలరించడం ముదావహం.

ప్రవాసాంధ్రుల సంక్షేమానికి పాటుపడే ఎన్నో అద్భుత కార్యక్రమాలకు అన్నివేళలా అండగా ఉంటూ Rapid IT తరుపున వదాన్యులగా తమ అమూల్య సహకారాన్ని అందిస్తున్న Gautham Goli, Biryani House, Biryani Pot మరియు ఇతరేతరుల అభిమానపూర్వక సహకారాలకు సంస్థ హృదయపూర్వక అభినందనలు తెలియచేసింది.

ఇంతటి గొప్ప నిర్వహణా పటిమను నిరూపించుకున్న TDF సంస్థతో తమ అనుబంధం పదిలం అంటూ అతిథులందరు ప్రస్తావించగా, రానున్న దసరా సంబరాలతో TDF మరింత సందడి చేయబోతుందని, అందుకు ఎళ్లరి సహకారం అందించగలరని కోరుకుంటూ స్వాతి సుదిని అందరికీ సంస్థ తరుపున తమ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected