Connect with us

Convention

TTA Mega Convention కి ఊపు తెచ్చిన అట్లాంటా కిక్ ఆఫ్ ఈవెంట్

Published

on

తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) మెగా కన్వెన్షన్ (Convention) కోసం నిధుల సేకరణలో భాగంగా నిర్వహిస్తున్న కిక్ ఆఫ్ ఈవెంట్స్ విజయవంతంగా సాగుతున్నాయి. అధ్యక్షులు వంశీ రెడ్డి కంచరకుంట్ల మరియు కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజు ఆధ్వరంలో అమెరికాలోని మేజర్ సిటీస్ లో స్థానిక TTA Chapters నిర్వహణలో ఈ కిక్ ఆఫ్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా గత వారాంతం ఫిబ్రవరి 24 సాయంత్రం అట్లాంటా (Atlanta) లో అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు భరత్ రెడ్డి మాదాడి సారధ్యంలో నిర్వహించిన కిక్ ఆఫ్ అండ్ నిధుల సేకరణ (Kick Off & Fundraiser) కార్యక్రమం ఊపు తెచ్చింది అని చెప్పవచ్చు. అనుకున్నదానికంటే అందరి అంచనాలను మించి 3,20,000 డాలర్ల విరాళాలు సేకరించారు.

ఈ దాతలలో ముఖ్యంగా అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు భరత్ రెడ్డి మాదాడి (Bharath Reddy Madadi) $100,000 మరియు ప్రముఖ అట్లాంటా నేత గౌతమ్ గోలి $50,000 లతో మార్గదర్శకంగా నిలిచారు. ఈ కార్యక్రమానికి చార్లెట్ నుంచి ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది (Naveen Reddy Mallipeddi) కూడా హాజరవ్వడం అభినందనీయం.

TTA నాయకులకు ఘనంగా స్వాగతం పలకగా, అందరూ సోషలైజ్ అయిన తర్వాత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించారు. అందరికీ స్వాగతం పలికి, TTA నాయకులు ఆహ్వానితులను ఉద్దేశించి ప్రసంగించారు. సియాటిల్ (Seattle) లో మొదటిసారి నిర్వహిస్తున్న TTA Mega Convention కి అందరినీ సభాముఖంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు వంశీ రెడ్డి కంచరకుంట్ల Telangana American Telugu Association (TTA) లాంటి చక్కని ప్లాట్ ఫామ్ ని ఏర్పాటుచేసిన వ్యవస్థాపకులు డా. పైళ్ల మల్లారెడ్డి (Dr. Pailla Malla Reddy), అడ్వైజరీ కౌన్సిల్ ఛైర్ డా. విజయపాల్ రెడ్డి, కోఛైర్ డా. మోహన్ రెడ్డి పటలోళ్ళ, సభ్యులు భరత్ రెడ్డి మాదాడి లను కొనియాడారు.

అనంతరం పలువురు తమ డొనేషన్స్ ప్రకటించారు. వీరిని వేదికపై ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి TANA, ATA, NATA, GTA, TDF వంటి జాతీయ తెలుగు సంఘాల నేతలు మరియు TAMA, GATA, GATeS వంటి స్థానిక తెలుగు సంఘాల నేతలు హాజరయ్యి మద్దతు తెలపడం విశేషం.

ఈ మొత్తం కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విజయవంతం అవ్వడానికి నేతలు మరియు సభ్యులు స్వాతి చెన్నూరి, వెంకట్ గడ్డం, కార్తీక్ నిమ్మల, సుధీర్ రెడ్డి కొత్త, త్రిలోక్ గుంటుక, ప్రభాకర్ మధుపతి, గిరి కోటగిరి, జ్యోత్స్న పాలకుర్తి, వాణి గడ్డం, దీప్తి ఎలుగూరి, దీపికా రెడ్డి నల్లా, శ్వేత నిమ్మల, శైలజ, సుప్రజ, నిధీశ్, మధు, కిరణ్, శ్రీపాల్, శశాంక్, మాధవ్, అశోక్ తదితరులు ముఖ్యకారణం.

జనార్ధన్ పన్నెల, రాగవాహిని తమ పాటలతో, జ్యోత్స్న పాలకుర్తి తన వ్యాఖ్యానంతో, డీజే పాటలతో రజనీకాంత్ అందరినీ అలరించారు. ఈ కిక్ ఆఫ్ ఈవెంట్ విజయవంతం అయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. బిర్యానీ పాట్ అనీల్ అందించిన డిన్నర్ అనంతరం వందన సమర్పణతో అట్లాంటా (Atlanta) కిక్ ఆఫ్ ఈవెంట్ ముగిసింది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected