Connect with us

Tech

టెక్నాలజీపై పట్టు సాధించేలా NATS కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం @ Hyderabad, India

Published

on

Hyderabad, మే 20, 2024: అమెరికాలో తెలుగువారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం NATS ఇటు తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) కూడా సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తుందని నాట్స్ (North America Telugu Society) అధ్యక్షుడు బాపయ్య చౌదరి (బాపు) నూతి అన్నారు.

హైదరాబాద్ (టెక్నాలజీపై పట్టు సాధించేలా NATS కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం (Hyderabad, India) ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో నాట్స్ సహకారంతో అవని ఫౌండేషన్ ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని (Computer Training Center) బాపు నూతి ప్రారంభించారు. విద్యార్ధులు మల్టీ స్కిల్స్ నేర్చుకుంటే వారికి భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని అన్నారు.

డిజిటల్ యుగంలో టెక్నాలజీ (Technology) నైపుణ్యం ఎంతో కీలకమని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాలు ఇప్పుడు భారత్ (India) వైపు చూస్తున్నాయన్నారు. బేసిక్స్, లాంగ్వేజస్ పై పట్టు సాధించి సరికొత్త టెక్నాలజీ కోర్సులు చేస్తే యువత ఉపాధి అవకాశాలకు ఎలాంటి ఢోకా ఉండదని బాపు నూతి (Bapaiah Chowdary Nuthi) భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో నాట్స్ (NATS) డల్లాస్ కో ఆర్డినేటర్ రవి తాండ్ర, రామానంద తీర్థ గ్రామీణ యూనివర్సిటీ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషోర్ రెడ్డి, స్పర్శ ఫౌండేషన్ సిఇవో పంచముఖి, సీనియర్ జర్నలిస్ట్ కొండూరు వీరయ్య, తెలంగాణ బుక్ ట్రస్ట్ కార్యదర్శి కోయ చంద్రమోహన్, ఏఐటీయూసీ నాయకులు బాలకాశి తదితరులు పాల్గొన్నారు.

గతంలో నాట్స్ (North America Telugu Society) సహకారంతో కంప్యూటర్ కోర్సు పూర్తి చేసిన విద్యార్ధులకు సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో బాపు నూతికి అలిశెట్టి ప్రభాకర్ కవిత పుస్తకాన్ని బహుకరించారు. యువతకు ఉపయోగపడే ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేపట్టిన నాట్స్ నాయకులను నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని (Prasanth Pinnamaneni) అభినందించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected