ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఎన్నికలలో నిరంజన్ శృంగవరపు ప్యానెల్ అందరూ ఊహించినట్టుగానే భారీ విజయకేతనం ఎగరవేసింది. గత నాలుగు నెలలుగా ఇండియా ఎలక్షన్స్ ని మరిపించేవిధంగా సాగిన తానా ఎన్నికల ప్రచారం నిరంజన్ ప్యానెల్ విజయంతో ముగిసింది. నిరంజన్ శృంగవరపు తన సమీప ప్రత్యర్థి నరేన్ కొడాలి పై 1758 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
అలాగే నిరంజన్ ప్యానెల్ లో బోర్డు సభ్యులుగా నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి, జనార్దన్ నిమ్మలపూడి, కార్యనిర్వాహకవర్గంలో సతీష్ వేమూరి, అశోక్ కొల్లా, మురళి తాళ్లూరి, భరత్ మద్దినేని, రాజా కసుకుర్తి, శిరీష తూనుగుంట్ల, ఉమ కటికి ఆరమండ్ల, హితేష్ వడ్లమూడి, శశాంక్ యార్లగడ్డ, ఫౌండేషన్ ట్రస్టీస్ గా కిరణ్ గోగినేని, పురుషోత్తమ చౌదరి గుడె, శ్రీకాంత్ పోలవరపు, శ్రీనివాస్ ఓరుగంటి, వినయ్ మద్దినేని, ప్రాంతీయ కార్యదర్సులుగా వంశి వాసిరెడ్డి మరియు ప్రదీప్ గడ్డం గెలుపొందారు. తానాలో ఉన్న కొందరి గుత్తాధిపత్యంతో విసిగి వేసారిపోయిన ప్రవాసాంధ్రులు నిరంజన్ ప్యానెల్ కి బ్రహ్మరథం పట్టారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఫుల్ ప్యానెల్ స్వీప్ చెయ్యడంతో నిరంజన్ టీం తానాలో సరికొత్త చరిత్ర సృష్టించింది. నిరంజన్ శృంగవరపు ప్యానెల్ ని జయ్ తాళ్లూరి, అంజయ్య చౌదరి లావు మరియు శ్రీనివాస్ లావు బలపరచగా, నరేన్ కొడాలి ప్యానెల్ ని జయరాం కోమటి, గంగాధర్ నాదెళ్ల మరియు సతీష్ వేమన బలపరిచారు. తానాలో కొన్ని సంవత్సరాలుగా నియంతృత్వ పోకడలతో తమ వారికే పదవులు కట్టబెడుతూ వచ్చిన త్రిమూర్తులకి ఈ ఓటమి కోలుకోలేని పెద్ద ఎదురు దెబ్బనే చెప్పాలి. నిరంజన్ ప్యానెల్ లో ప్రతి ఒక్కరూ ఎవరిని కోరినా బ్యాలెట్ లో పైనుంచి కింది వరకు తమ ప్యానెల్ లోని ప్రతి ఒక్కరికీ వోట్ వెయ్యమని అడగడం వారి టీం స్పిరిట్ కి అద్దం పట్టింది. వివాదరహితులందరూ వెన్నుతట్టి చివరివరకు నిలబడడం మరియు పోటీలో యువత, మహిళలకి పెద్దపీట వెయ్యడం వీరి విజయంలో ముఖ్యపాత్ర వహించాయని చెప్పొచ్చు.
అభ్యర్థులు – పోలైన ఓట్లు
నిరంజన్ శృంగవరపు – 10,866
నరేన్ కొడాలి – 9108
శ్రీనివాస్ గోనినేని – 741
నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి – 11116
జనార్ధన్ నిమ్మలపూడి – 10971
రవి పోట్లూరి – 9676
విజయ్ గుడిసేవ – 9193
అశోక్ కొల్లా – 11,465
జగదీష్ ప్రభాల – 9,168
మురళి తాళ్లూరి – 11,277
వెకంట్ కొగంటి – 9,377
భరత్ మద్దినేని – 11058
సునీల్ పంత్రా – 9621
రాజా కసుకుర్తి – 11,420
రజినీకాంత్ కాకర్ల – 9,571
శీరిష తూనుగుంట్ల – 11,451
సతీష్ తుమ్మల – 9,216
ఉమ కటికి ఆరమండ్ల – 11,153
చాందిని దువ్వూరి – 9,558
శశాంక్ యార్లగడ్డ – 11,420
అనిల్ చౌదరి ఉప్పలపాటి – 9,259
శ్రీకాంత్ పోలవరపు – 11322
కిరణ్ గోగినేని – 11085
శ్రీనివాస్ ఓరుగంటి – 10819
పురుషోత్తమ చౌదరి గుడె – 10774
వినయ్ మద్దినేని -10514
శ్రీనివాస్ ఎండూరి – 9416
సత్యనారాయణ మన్నె – 9184
రవి మందలపు – 9026
రాజా సూరపనేని – 9618
వరప్రసాద్ యాదన – 8302
వంశీక్రిష్ణ వాసిరెడ్డి – 706
శ్రీ పద్మలక్ష్మీ అద్దంకి – 371
ప్రదీప్ కుమార్ గడ్డం – 1052
రావు యలమంచిలి – 369
సతీష్ కొమ్మన – 1,280
దినేష్ త్రిపురనేని – 695
హనుమంతరావు చెరుకూరి – 446
శ్రీధర్ కుమార్ కొమ్మలపాటి – 373
సాయి బొల్లినేని – 240
శ్రీమన్నారాయణ యార్లగడ్డ – 130
సునీల్ కుమార్ కొగంటి – 535
శశిధర్ జాస్తి – 291
శశికాంత్ వల్లేపల్లి – 64
విద్యాధర్ గరపాటి – 54
ప్రసాద్ రావు నల్లూరి – 49
కిరణ్ అమిరినేని – 48