ఈ మధ్యనే జరిగిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 164 స్థానాలతో విజయాన్ని సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని డెలవేర్ రాష్ట్రంలో విల్మింగన్ నగర టిడిపీ (TDP) శాఖ అధ్యక్షుడు శ్రీ సత్యనారాయణ పొన్నగంటి గారి అధ్వర్యంలో ఉత్సాహంగా విజయోత్సవ సంబరాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసినవారు ముందుగా గత ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై సాగిన పోరాటంలో భాగస్వాములవుతూ అసువులు బాసిన కార్యకర్తలకూ, అమరావతి రైతులకూ, అప్పటి జగన్ ప్రభుత్వ దమనకాండలో మరణించిన ఇతర బడుగు బలహీన వర్గాలకు నివాళులర్పించారు.
అలాగే తెలుగు పాఠకుల ఆత్మ, ఎందరో తెలుగువారి ఉపాధికర్త, గత ప్రభుత్వ ప్రజాకంటక నిర్ణయాలను తన కలంతో చీల్చి చెండాడిన అక్షరయోధుడు శ్రీ చెరుకూరి రామోజీరావు (Cherukuri Ramoji Rao) గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా సభలో పాల్గొన వక్తలు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులను మరియూ ఎన్నారై నాయకులను అభినందించారు.
కాగా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ (TDP) కూటమి అభ్యర్థుల విజయంకోసం విదేశాల నుండి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కు వెళ్ళి పలువురు కూటమి అభ్యర్థుల గెలుపు కోసం చేసిన ప్రయత్నాలు కనీవినీ ఎరుగనివని కొనియాడారు. సభలో మాట్లాడిన వక్తలు కొత్త ప్రభుత్వం తక్షణ కర్తవ్యం ప్రతిపక్షం చేసిన తప్పులని వెలికితీసి చట్టబద్ధంగా శిక్షించాలని కోరారు. అలాగే కక్ష్యసాధింపులు కాకుండా అభివృద్ధిపై దృష్టిసారించాలని కోరుకున్నారు. రాష్ట్రం మరో వెనెజులా కాకుండా కాపాడాలని కోరుకున్నారు.
సభలో పాల్గొన్నవారు మరియూ ప్రసంగించిన వారిలో నగర పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ శ్రీధర్ బాబు ఆలూరి గారు, నగర పార్టీ కోశాధికారి శ్రీ చందు ఆరె, శ్రీ శ్రీని మాలెంపాటి గారు, శ్రీ శ్రీకాంత్ వీరమాచినేని గారు, శ్రీ సందీప్ వెంపరాల గారు, శ్రీ రాజా వెలగపూడి గారు, శ్రీ &శ్రీమతి మధు చుండూరు గారు, శ్రీ కిషోర్ కూకలకుంట్ల గారు, శ్రీ సురేష్ పాములపాటి గారు, శ్రీ శ్రీనివాస్ చెన్నారెడ్డి గారు, శ్రీ సురేష్ సోమేపల్లి గారు, తెలుగు మహిళలు శ్రీమతి గీత పొన్నగంటి గారు, శ్రీమతి శ్రీలక్ష్మి ఆలూరు గారు, శ్రీమతి సరిత చెరుకూరి గారు, శ్రీమతి లక్మీ దావులూరి గారు, శ్రీమతి ప్రతిమ గంటా గారు, శ్రీమతి వేద గారు, శ్రీమతి బిందు గారు, శ్రీమతి ఉయ్యూరు గీత గారు, శ్రీమతి శ్రీదేవి కూకలకుంట్ల గారు, శ్రీ & శ్రీమతి సూరజ్ కర్రా గారు, శ్రీ &శ్రీమతి మధుకర్ నలమసు గారు, శ్రీమతి తన్మయి వెలగపూడి గారు మరియు శ్రీ సంగమేశ్వర్రావు పంచుమర్తి గారు ఉన్నారు.
ఈ కార్యక్రమం తరువాత పాల్గొన్న ఆహుతులందరూ విందు అనంతరం ఎన్డీయే (National Democratic Alliance – NDA) ప్రభుత్వం సుధీర్ఘమైన సుపరిపాలన అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. ఈ విజయోత్సవ కార్యక్రమంలో విల్మింగ్టన్ (Wilmington), ఫిలడెల్ఫియా (Philadelphia) నగరాలనుంచి కుటుంబసమేతంగా ఆబాలగోపాలం వచ్చి పాల్గొనటం విశేషం.