. చంద్రబాబు తెచ్చిన ఐటీ విప్లవం వల్లే తాము అమెరికాలో స్థిరపడ్డట్టు వెల్లడి . పాల్గొన్న కోమటి జయరాం, మన్నవ సుబ్బారావు . ఘనంగా టీడీపీ 44 వ ఆవిర్భావ దినోత్సవ వేడుక
తెలుగు జాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమo అనే పునాదులపై తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) పురుడు పోసుకుందని ఉత్తర అమెరికా ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరామ్, గుంటూరు మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు.
బే ఏరియా మిల్పిటాస్ (Milpitas, Bay Area, California) పట్టణం లో 44 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ (NTR) చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. కేక్ కట్ చేసారు. పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కోమటి జయరాం (Jayaram Komati) జూమ్ కాల్ ద్వారా మాట్లాడారు. “తెదేపా ఆర్ధిక, రాజకీయ, సామాజిక రంగాల్లో అనేక మార్పులు తీసుకొని వచ్చింది. సమాజం లో ఉన్న రాజకీయ అసమానతలను తొలగించి బడుగు, బలహీన వర్గాల వారికీ రాజ్యాధికారం దక్కేలా చేసింది.
ఎన్టీఆర్ (Nandamuri Taraka Ramarao – NTR) ఆశయాలకు అనుగుణంగా పార్టీ ని చంద్రబాబు, లోకేష్ (Nara Lokesh) సమర్ధవంతంగా నడిపిస్తున్నారు. కొంగొత్త రాజకీయ ఆవిష్కరణలకు నూతన సంస్కరణలకు తెలుగుదేశం పార్టీ ప్రయోగశాల” అని జయరాం అన్నారు.
మన్నవ సుబ్బారావు (Mannava Subba Rao) మాట్లాడుతూ…తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP)24 ఏళ్ళు అధికారం లో, 20 ఏళ్లు ప్రతిపక్షం లో ఉంది. ఈ 44 ఏళ్ల ప్రయాణం లో ప్రజల పక్షానే నిలిచి అనేక ఉద్యమాలు చేసింది” అని పేర్కొన్నారు.
వెంకట్ కోగంటి (Venkat Koganti) మాట్లాడుతూ… తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చి ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు (Nara Chandrababu Naidu) ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని తెలిపారు. చంద్రబాబు తెచ్చిన ఐటీ విప్లవం వల్లే తాము అమెరికాలో ఈ స్థాయిలో ఉన్నామన్నారు.
ఈ కార్యక్రమాన్ని రాజశేఖర్ పర్వతనేని సమన్వయ పరిచారు. ఈ కార్యక్రమం లో విజయ్ గుమ్మడి (Vijay Gummadi), శ్రీకాంత్ దొడ్డపనేని, శ్రీనివాసు తడపనేని, విజయ్ జెట్టి, వెంకట్ అడుసుమల్లి (Venkat Adusumalli), సుబ్బా యంత్ర, రమేష్ మల్లారపు, రవి అడుసుమల్లి, హరి సన్నిధి,నరెంద్ర రెడ్ది యన్నం, భాస్కర్ మొలకలపల్లి, రవి కిరణ్, ఎంవీరావు, భరత్ ముప్పీరాల, గాంధీ పాపినేని, శివ అద్దంకి, జగదీష్ గింజుపల్లి, రామ్ తోట, శ్రీనివాస్ వల్లూరుపల్లి, సురేష్ పోతినేని, శశి దొప్పలపుడి, భాస్కర్ అన్నే, వాసు బండ్ల, రాజా కొల్లి,సీతారాం కొడాలి, భాస్కర్, చంద్ర గుంటుపల్లి, శ్రీనివాస్ పొటకమూరి తదితరులు పాల్గొన్నారు.