Connect with us

News

అమెరికాలోని 40 నగరాల్లో టీడీపీ ఆవిర్భావదినోత్సవ వేడుకలకు సన్నాహాలు

Published

on

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు అవనున్న తరుణంలో అమెరికాలోని 40 నగరాలలో ఒకే రోజున ఆవిర్భావదినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. భారత కాలమానం ప్రకారం 2022 మార్చి 29 కి 40 సంవత్సరాలు నిండుతాయి.

కావున అదేరోజున అమెరికా కాలమానం ప్రకారం మార్చి 28 సాయంత్రం అమెరికాలోని 40 ముఖ్య నగరాలలో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రముఖ ఎన్నారై టీడీపీ నాయకులు జయరాం కోమటి ఆధ్వర్యంలో ఇప్పటికే అన్ని నగరాల సమన్వయకర్తలతో రెండు సార్లు సమావేశమయ్యారు.

అలాగే ఇండియా నుంచి బుచ్చిరామ్ ప్రసాద్ కలపటపు పార్టీ ఆఫీస్ నుంచి సమన్వయపరుస్తున్నారు. బ్యానర్స్, కరపత్రాలు, ఆహ్వానపత్రాలు, కార్యక్రమాల నిర్వహణ తదితర విషయాలకు సంబంధించి ఎన్నారై టీడీపీ సెల్ సభ్యులతో కూలంకుషంగా చర్చించారు. దీంతో మార్చి 28 సాయంత్రం అమెరికాని పసుపుమయం చేస్తామంటున్నారు తెలుగుదేశం పార్టీ అభిమానులు.

అమెరికాలోని ప్రాంతాల వారీగా టీడీపీ ఎన్నారై కౌన్సిల్ మెంబర్ల వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. తెలుగు ప్రజల ప్రగతి కోసం, తెలుగు రాష్ట్రాల పునర్నిర్మాణం కోసం తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా అంటూ నిర్వహించే తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పండుగతో ఎన్నారై టీడీపీ సభ్యుల్లో నూతనుత్తేజం వెల్లివిరిసేలా ఉంది.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected