తెలుగు దేశం పిలుస్తుంది రా కదిలిరా అనే పిలుపుతో, నేల ఈనిందా ఆకాశం చిల్లుపడిందా అనే విధముగా బోస్టన్ ఎన్నారై టీడీపీ కార్యకర్తలు సమావేశమై తెలుగుదేశం పార్టీ 40 వసంతాల పండుగని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అన్న ఎన్టీఆర్ ని గుర్తుచేసుకుంటూ, పార్టీ స్థాపించినప్పటి నుండి ఇప్పటివరకు, 40 వసంతాల కాలంలో తెలుగు దేశం చేసిన సంస్కరణలను క్లుప్తంగా ప్లకార్డ్స్ రూపంలో ప్రదర్శించి నేటి యువతకు అర్థమయ్యేలా వివరించారు. వాటి అన్నిటిని సోషల్ మీడియా లో పంచుకొని యువత కి మరింత చేరువయ్యేలా చేయాలనీ ప్రణాళిక చేసారు.
పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్ర బాబు నాయుడు గారి సందేశాన్ని, ఈ కార్యక్రమంలో జూమ్ ద్వారా పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పాల్గొని, బోస్టన్ ఎన్నారై యువతకు తెలియజేసారు. ఎన్నారైలు మాతృభూమి కోసం పడుతున్న తాపత్రయాన్ని గుర్తించి వారి సేవలను కొనియాడారు. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జై చంద్ర బాబు, జై లోకేష్ అనే నినాదాలతో 100 మంది కి పైగా పసుపు దళం కుల మతాలకి అతీతంగా పాల్గొని సభా ప్రాంగణాన్ని మారు మోగించారు.
ఈ సందర్బముగా కార్యకర్తలు మాట్లాడుతూ పలురకాల ఆలోచలనలను పంచుకున్నారు. వాటిలో ముఖ్యాంశాలు…
ప్రతి గ్రామ కూడలిలో ఒక బ్యానర్ రూపంలో తెలుగు దేశం చేసిన సంస్కరణలు, నిత్యావసర వస్తువులు రేట్లను గత ప్రభుత్వ హయాము కి ఇప్పటికి వ్యత్యాసాలను ప్రదర్శించాలని కోరారు.
ఒక తెలుగు సోదరుడు తాను ఈరోజు ఉన్నత స్థానం లో ఉండటానికి కారణం వారి తల్లితండ్రులతో పాటు, తెలుగుదేశం చేసినటువంటి రైతులకి పంట రుణాలు, సబ్సిడీ విద్యుత్తు, IT రెవల్యూషన్, సరైన సమయములో ఇంజనీరింగ్ కాలేజీల ఆవశ్యకతను గుర్తించి వాటిని పెంచేవిదంగా కృషి చేయటం వంటి సంస్కరణలు కారణమని, పార్టీ ఈరోజు రెండు తరాల నుండి చదువుకున్న యువత విదేశాలలో స్థిరపడటం వలన కోల్పోయింది కాబట్టి కొంత పార్టీకోసం తిరిగి ఇవ్వవలసిన సమయం ఆసన్నమైందని గుర్తుచేశారు.
ప్రతి ఎన్నారై, రోజుకి ఒక నిమిషము సమయము వెచ్చించి సోషల్ మీడియా లో అబద్దపు ప్రచారాలను ఎండగట్టి వాస్తవాలను ప్రజానీకాన్ని చేరవేయాలని సూచించారు.
పేదరికం వలన కనీస అవసరాలు అయినటువంటి కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం ఇలాంటివి అందక ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి కనీసం రెండు కుటుంబాలని, ప్రతి ఎన్నారై దత్తత తీసుకోవాలని ఆకాంక్షించారు. తద్వారా వారిలో తెలుగుదేశం యుక్క సిద్ధాంతాన్ని, లక్ష్యాలను ఆలోచింప చేయగలరని చెప్పారు.
ఒక ఎన్నారై ఆవేదన చెందుతూ, గుడివాడ లో తనకున్న షాపింగ్ కాంప్లెక్స్ ని ప్రస్తుతం వున్న మాఫియా గవర్నమెంట్ నాయకులు ఖబ్జా చేసి దోచుకోవడానికి ప్రయత్నించారని, ఇలానే వదిలేస్తే రేపు అందరి ఎన్నారైల ఆస్తులని గుర్తించి లాగేసుకుంటారని, ఇలాంటి అక్రమార్కులకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని గర్జించారు.