తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (Telangana Development Forum – TDF) అట్లాంటా చాప్టర్ బతుకమ్మ & దసరా పండుగ సెలబ్రేషన్స్ సెప్టెంబర్ 27, శనివారం రోజు 2 గంటల నుండి నిర్వహించనున్నారు. కమ్మింగ్ (Cumming, Atlanta) పట్టణంలోని అలయన్స్ అకాడమీ ఈ కార్యక్రమానికి వేదిక కానుంది.
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ అట్లాంటా చాప్టర్ (TDF Atlanta Chapter) సిగ్నేచర్ ఈవెంట్ అయిన ఈ బతుకమ్మ మరియు దసరా సెలబ్రేషన్స్ లో గాయనీగాయకులు ఉమ జంగా మరియు సంతోష్ భరత్ ఎల్లపంతుల తమ పాటలతో అలరించనున్నారు.ఈ ఈవెంట్ కి ప్రవేశం ఉచితం.
లోకల్ టాలెంట్ సాంస్కృతిక కార్యక్రమాలు (Cultural Programs), బతుకమ్మ పోటీలకు క్యాష్ బహుమతులు, బతుకమ్మ పూజ, బతుకమ్మ ఆట పాట, నిమజ్జనం, డిన్నర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. డా. వాణి గడ్డం (Dr. Vani Gaddam) ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
తన మన ధన అంటూ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ గత 25 సంవత్సరాలుగా తెలంగాణ సమాజానికి ఇటు అమెరికాలో అటు ఇండియాలో సేవలందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అట్లాంటా చాప్టర్ అధ్యక్షునిగా డా. గణేష్ తోట (Dr. Ganesh Thota) సారధ్యంలో కమిటీ విరివిగా పని చేస్తుంది.
ఈ బతుకమ్మ మరియు దసరా సెలబ్రేషన్స్ కి ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. నవ రాత్రులలో భాగంగా మొదటి రోజు ని పురస్కరించుకొని ఎంగిలి పూల బతుకమ్మ ని కొలుస్తూ అట్లాంటా (Atlanta, Georgia) వాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేసిన ప్రోమో వీడియో కూడా అందరినీ ఆకట్టుకుంటుంది.
సెప్టెంబర్ 27, శనివారం రోజు 2 గంటల నుండి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న బతుకమ్మ (Bathukamma) మరియు దసరా (Dasara) సెలబ్రేషన్స్ లో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (TDF) అట్లాంటా చాప్టర్ నాయకులు కోరుతున్నారు.