గత కొన్ని రోజులుగా అమెరికాలోని చికాగో సెక్స్ రాకెట్ విషయంలో కొంతమంది పని కట్టుకొని మరీ ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ అధ్యక్షులు సతీష్ వేమన ప్రమేయం గురించి విష ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు హోంలాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ ఏజెంట్ బ్రయన్ జిన్ యూ ఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో కిషన్ మోదుగుముడి అలియాస్ రాజు మీద ప్రవేశపెట్టిన కంప్లైంటుని మోర్ఫ్ చేసి మరీ ఫేస్బుక్, వాట్సాప్ లలో షేర్ చేస్తూ శునకానందాన్ని పొందుతున్నారు. దీంతో సతీష్ వేమన మీడియా కి మరియు తానా మెంబెర్స్ కి ఆధారాలతో సహా అసలు నిజాలు తెలియజేసారు. తనను ఏజెంట్ బ్రయన్ జిన్ మే 8న ఫోన్లో సంప్రదించడానికి ప్రయత్నించడం నిజమేనని, కానీ అప్పుడు అందుబాటులో లేకపోవడం వలన అదే రోజు సాయంత్రం మాట్లాడి ఇన్వెస్టిగేషన్కి సహకరించానని తెలియజేసారు. ఈ విషయాన్ని ఏజెంట్ బ్రయన్ జిన్ కంప్లైంట్లోని 27వ పేజీలో కూడా పొందుపరిచారు. అదేవిధంగా కిషన్ మోదుగుముడి తో తనకు పరిచయం లేదని, టాలీవుడ్ ఆర్టిస్ట్స్ కి సంబంధించి ఎలాంటి లెటర్స్ ఇవ్వలేదని, అవన్నీ నకిలీవని సతీష్ తెలియజేసారు. ఏజెంట్ బ్రయన్ జిన్ కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తూ కిషన్ ఇంకా అనేక తెలుగు సంస్థల లెటర్స్ కూడా ఫోర్జరీ చేసారని చెప్పారు కూడా. 41 ఏళ్ళ తానా ఎప్పుడూ ఇలాంటివి చేయదని, ఆర్టిస్ట్స్ కోసం ఏజెంట్స్ని ఎప్పుడు సంప్రదించలేదని, మన భారతీయ భాషా సంస్కృతీ సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ముందుకు సాగుతామన్నారు. ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా తిప్పికొడుతూ టీవీ5, మహా న్యూస్, ఏ పి 24×7 మరియు ఎన్ టీవీ లైవ్ డిబేట్లలోనూ ఈవిషయాలను వివరిస్తూ సతీష్ తో బాటు తానా ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయ్ తాళ్లూరి ముక్తకంఠంతో ఖండించారు.