Published
4 years agoon
By
NRI2NRI.COMతానా ఎలక్షన్స్ లో ‘తానా ఫర్ ఛేంజ్’ నినాదంతో నిరంజన్ శృంగవరపు టీం నరేన్ కొడాలి టీంపై ఘనవిజయం సాధించింది. ఇటు అమెరికాలోనే కాకుండా అటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా కుతూహలం రేపిన ఈ విజయంలో పాలుపంచుకున్న వివిధ పాత్రలు వాటి తీరుతెన్నులు పరిశీలిద్దాం. తానా ఫర్ ఛేంజ్ టీంకి జయ్ తాళ్లూరి, అంజయ్య చౌదరి లావు మరియు శ్రీనివాస్ లావు బ్యాక్ బోన్ పాత్ర పోషించారని అందరికీ తెలిసిందే. తానా గాడ్ ఫాదర్స్ అని చెప్పుకునేవారికి మూడు చెరువుల నీళ్లు తాగించిన ఈ ఎలక్షన్స్ లో, వీరితోపాటు ఇంకొన్ని ముఖ్యపాత్రలు పోషించిన మరికొందరి వివరాలు ఎన్నారై2ఎన్నారై.కామ్ మీకోసం అందిస్తుంది.
డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి: బోర్డు సభ్యునిగా గెలిచిన వాసు టీం మొత్తం మీద సీనియర్. వృత్తిరీత్యా డాక్టర్ అయిన తను ధీటైన వ్యూహరచనలతో వ్యతిరేక వర్గానికి ఒకరకంగా శస్త్రచికిత్స చేసారని చెప్పాలి.
హరీష్ కోయ: ప్రస్తుత బోర్డు చైర్మన్ గా వ్యవహరిస్తున్న హరీష్ బయటికి పెద్దగా కనపడకపోయినా, లోలోపల లాజిస్టిక్స్ ప్రణాళిక మరియు వాటి నిర్వహణ బాధ్యతలు నిర్వహించారు.
నిరంజన్ శృంగవరపు: కార్యనిర్వాహక ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన నిరంజన్, ఎవ్వరినీ నొప్పించకుండా టీం మొత్తాన్ని ఎలక్షన్స్ ఆసాంతం ఒకేతాటిపై నిలపడంలో సఫలీకృతులయ్యారు. ఎలక్షన్ డేట్ దగ్గిరకొచ్చే కొద్దీ నిరంజన్ గేరు మార్చి క్యాంపెయిన్ సభలలో, టీవీ ఇంటర్వ్యూల్లో దూసుకెళ్లారు.
సతీష్ వేమూరి: జనరల్ సెక్రెటరీ గా ఏకగ్రీవంగా గెలిచినప్పటికీ బ్లడ్ పెట్టి మరీ యాక్టీవ్ గా వర్క్ చెయ్యడం ద్వారా టీంకి అందివచ్చిన అస్సెట్ గా మారారు సతీష్ . లెక్కలు తేలతాయి అంటూ టీంలో ఎప్పటికప్పుడు ఉత్తేజాన్ని నింపారు.
పైన చెప్పిన 7 పాత్రలు టీం విజయంలో కీలకం అని డెట్రాయిట్ సక్సెస్ సభలో నిరంజన్ చెప్పిన మాటలు మా విశ్లేషణకి నిదర్శనం. ఇక మిగతా పాత్రల కథాకమామిషు చూద్దాం పదండి.
డాక్టర్ ప్రసాద్ నల్లూరి: తక్కువ ఓట్లు ఉండే డోనార్ కేటగిరీలో ఫౌండేషన్ ట్రస్టీ గా పోటీచేసిన ప్రసాద్ తన పాస్ట్ ఎక్సపీరియెన్స్ అంతటిని వాడి ఎప్పటికప్పుడు టీంకి సలహాలు అందించారు.
కిరణ్ అమిర్నేని: డోనార్ కేటగిరీలో ఫౌండేషన్ ట్రస్టీ గా పోటీచేసిన కిరణ్ తన శక్తి మేర చివరినిమిషం వరకు ప్రయత్నలోపం లేకుండా కృషి చేసారు.
జనార్దన్ నిమ్మలపూడి: బోర్డు సభ్యునిగా గెలిచిన జానీ క్యాపిటల్ ఏరియాలో సతీష్ వేమన వర్గానికి వ్యతిరేకంగా రొమ్ము విరిచి నిలబడడమే కాదు సక్సెస్ అయ్యారని కూడా చెప్పాలి. తనతోపాటు సతీష్ మేకా కష్టాన్ని, ధైర్యాన్ని కూడా అభినందించాలి.
శ్రీకాంత్ పోలవరపు: ఫౌండేషన్ ట్రస్టీగా గెలిచిన డల్లాస్ అందరివాడు శ్రీకాంత్. డల్లాస్ పైన పెట్టుకున్న నరేన్ వర్గం ఆశలు అడియాశలు అవ్వడంలో కీలకపాత్ర పోషించారు. అన్ని లోకల్ అసోసియేషన్స్‌తో సత్సంబంధాలు ఉండడం విశేషం.
పురుషోత్తమ చౌదరి గుదె: పురుషోత్తం ఎక్కడా దాపరికంలేకుండా క్లీన్ స్లేట్ ల పనిచేయడమేకాకుండా, వోట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న అపలాచియన్ ప్రాంతం నుంచి టీంకి మంచి బలాన్ని చేకూర్చారని చెప్పాలి.
శ్రీనివాస్ ఓరుగంటి: ఫౌండేషన్ ట్రస్టీగా గెలిచిన శ్రీనివాస్ మంచి ఆధ్యాత్మిక ఆలోచనలతో న్యూజెర్సీ ప్రాంతంలో బాగానే ఓట్లు రాబట్టారు. అలాగే ఫోన్ కాల్స్ ద్వారా వేరే ప్రాంతాలను కూడా చుట్టేశారు.
వినయ్ మద్దినేని: పని రాక్షసుడుగా పిలవబడే వినయ్ అట్లాంటా అందరివాడుగా టీంకి వాల్యూ యాడ్ చేసారు. తెలుగు సంస్థలే కాకుండా స్థానిక ఇతర సంస్థల్లో కూడా మంచి పేరే ఉంది.
కిరణ్ గోగినేని: అట్లాంటా స్థానబలంతోపాటు అందరి బలాన్ని ఏకోన్ముఖంగా సంపాదించిన మృదు స్వభావి కిరణ్ విజయం ఊహించిందే.
అశోక్ బాబు కొల్లా: ఎప్పటినుంచో తానాలో రూట్ లెవెల్ లో పనిచేసిన అనుభవం, అందరితో సత్సంబంధాలు, తనకంటూ ఒహాయో ప్రాంతంలో సొంత టీం ఉండడం అశోక్ బలం.
మురళి తాళ్లూరి: ఆస్టిన్ ప్రాంతంలో తానా కార్యక్రమాల విస్తరణలో తనదైన ముద్ర, క్యాంపెయిన్ సభల్లో విరివిగా పాల్గొనడం, సౌమ్యునిగా మంచి పేరుండడం కలిసొచ్చింది.
భరత్ మద్దినేని: పబ్లిసిటీ ఇష్టపడని వ్యక్తి భరత్. హోల్ టీంకి బ్యాకెండ్‌లో మార్కెటింగ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూట్ చేయడం, అత్యధిక ఓటు బ్యాంక్ ఉన్న అట్లాంటాలో పోల్ మానేజ్మెంట్ పక్కాగా నిర్వహించడం మొత్తం టీంకి బలమైంది.
రాజా కసుకుర్తి: తక్కువ టైంలో ఎక్కువ తానా కార్యక్రమాలు నిర్వహించి లైమ్ లైట్లో కొచ్చిన న్యూజెర్సీ మృదుశాలి రాజా. నిరంజన్ టీం మొత్తానికి మంచి ఊపు తెచ్చిన న్యూజెర్సీ సభ నిర్వహణలో రాజా పాత్ర మరువలేనిది.
శిరీష తూనుగుంట్ల: ఒక పక్క తానా ప్రస్తుత కార్యక్రమాల నిర్వహణ, మరోపక్క ఊరూరా తిరిగి క్యాంపెయిన్ లో పాల్గొనడం ద్వారా ఎలక్షన్ రేసులో ముందున్నారని చెప్పాలి.
డాక్టర్ ఉమ కటికి ఆరమండ్ల: చికాగో ప్రాంతంలో ఒక మహిళగా అందరి మద్దతు కూడగట్టడం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం, క్యాంపెయిన్ లో భాగంగా తన బాణీ వినిపించడం ద్వారా టీంకి వాల్యూ యాడ్ చేసారని చెప్పవచ్చు.
శశాంక్ యార్లగడ్డ: తానాలో మొట్టమొదటిసారిగా నెక్స్ట్ జనరేషన్ యువతకి ప్రాతినిధ్యం వహించేలా, అటు తెలుగు ఇటు ఇంగ్లీష్ ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకోవడం ద్వారా టీంకు మంచి బలం అయ్యారు.
హితేష్ వడ్లమూడి: ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ గా ఏకగ్రీవంగా గెలిచినప్పటికీ, బ్యాకెండ్ లాజిస్టిక్స్ లో తనదైన పాత్ర పోషించారు. అంతేకాకుండా అంజయ్య చౌదరి లావు తోపాటు కొన్ని నేషనల్ క్యాంపెయిన్స్ లో అట్లాంటా తరపున పాల్గొన్నారు.
సుమంత్ రామిశెట్టి: కౌన్సిలర్ ఎట్ లార్జ్ పొజిషన్ కి తన నామినేషన్ తిరస్కారానికి గురైనప్పటికీ, టీంకి తనవంతు సాయాన్ని అందించారు.
వంశి వాసిరెడ్డి: న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధిగా గెలిచిన వంశి పాత్ర మార్కెటింగ్ మెటీరియల్ సమన్వయం చేయడంలో మరువలేనిది.
ప్రదీప్ గడ్డం: న్యూ ఇంగ్లండ్ ప్రాంతంలో తనకున్న స్తానిక బలగం బంపర్ మెజారిటీ చూస్తేనే అర్ధమవుతుంది, అదే టీంకి కూడా బలమయ్యింది.
శశిధర్ జాస్తి: ఓపెన్ హార్ట్ తో తన శక్తి మేరకు టీంకోసం పనిచేసిన వ్యక్తి శశిధర్.
శ్రీధర్ కొమ్మాలపాటి: టైట్ రేసులో చివరి నిమిషం వరకు పోరాడి టీం గెలుపుకి తోడ్పడిన శ్రీధర్ ని అభినందించాలి.
శ్రీమాన్ యార్లగడ్డ: తానా ఎలక్షన్స్ కి కొత్తయినప్పటికీ, మిత్రధర్మం పాటించి టీం స్పిరిట్ తో టీం కోసం పోరాడారు.
సురేష్ కాకర్ల: ర్యాలీ తోపాటు మొత్తంగా అపలాచియన్ ప్రాంతం నుండి తన ఫుల్ సపోర్ట్ అందించిన సురేష్ అండ్ టీం తోడ్పాటు ప్రత్యేకమైనది. క్యాంపెయిన్‌లో మొట్టమొదటి ఆన్లైన్ జూమ్ మీటింగుకి మరియు తర్వాత ఫేస్ టు ఫేస్ మీటింగుకి కూడా అపలాచియన్ ప్రాంతవాసులను భారీగా సమీకరించి మంచి ఆరంభాన్నిచ్చారు.
శ్రీనివాస్ కూకట్ల: టీం కోసం తన క్యాపిటల్ ఏరియా రీజినల్ కోఆర్డినేటర్ నామినేషన్ వాపసు తీసుకోవడమే కాకుండా, ఒంటి చేత్తో మేరీల్యాండ్ ఓట్లన్నీ గంపగుత్తగా తానా ఫర్ ఛేంజ్ టీంకి పడేలా చక్రం తిప్పారు. అలాగే మార్కెటింగ్ టీంలో తన పాత్ర మరువలేనిది.
శ్రీనివాస్ ఉయ్యూరు: క్యాపిటల్ ఏరియా రీజినల్ కోఆర్డినేటర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనప్పటికీ, డీసీ ప్రాంతంలో గట్టిగా నిలబడడమే కాకుండా వ్యతిరేకవర్గంవారు బ్యాలెట్స్ అపహరణకు పాల్పడినప్పుడు ధైర్యంగా ఎదుర్కొన్నారు. అలాగే తన ఎన్నారై స్ట్రీమ్స్ మీడియా ద్వారా తానా ఫర్ ఛేంజ్ టీంకి విరివిగా ప్రచారం చేసారు.
ఠాగూర్ మల్లినేని: సోషల్ మీడియా క్యాంపెయిన్ లో చెయ్యితిరిగిన ఠాగూర్ పాత్రని తానా ఫర్ ఛేంజ్ టీం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది. వ్యతిరేకవర్గం నుండి బెదిరింపులు, అవమానాలు ఎదురైనప్పటికీ ఒడ్డి నిలిచిన వ్యక్తి ఠాగూర్. ఈ సందర్భంగా తనకి హెల్ప్ చేసిన పబ్లిసిటీ బృందాన్ని కూడా అభినందించాలి.
అలాగే తానా పాస్ట్ ప్రెసిడెంట్స్, లీడర్షిప్, పేర్లు చెప్పుకోవడానికి ఇష్టపడని పోల్ మానేజ్మెంట్ చేసినవారు, సౌత్ఈస్ట్, అపలాచియన్, డెట్రాయిట్, కాలిఫోర్నియా, డీసీ ఇలా అమెరికా వ్యాప్తంగా అన్ని ప్రాంతాలనుంచి బ్యాకెండ్‌లో పనిచేసిన ప్రతిఒక్కరూ తమ పాత్ర సమర్ధవంతంగా నిర్వహించారు.