తానా ఎలక్షన్స్ లో టీం నిరంజన్ “తానా ఫర్ చేంజ్” అనే నినాదంతో నాలుగు ప్రధాన అంశాలలో మార్పే లక్ష్యంగా తానా కొరకు తానా చేత తానా యొక్క మార్పు కోసం టీమ్ నిరంజన్ ఉద్యమం అంటున్న సంగతి తెలిసిందే. అవేంటో చూద్దాం రండి.
జవాబుదారీతనం:- తానా రాజ్యాంగాన్ని అనుసరించి ప్రతి సభ్యునికీ ప్రతి విషయంలో దాపరికం లేకుండా ప్రజాస్వామ్య పద్దతిలో జవాబుదారీగా ఉండడం.
పారదర్శకత:- తానా నుంచి ఖర్చుపెట్టే ప్రతి డాలర్ కి, ప్రతి సెంట్ కీ దాపరికం లేకుండా లెక్కలు చూపడం.
సేవాతత్పరత:- వ్యక్తులు ముఖ్యం కాదు తానా ముఖ్యం అంటూ సేవాతత్పరతతో సేవ చేసే వారిని ప్రోత్సహించడం.
నిబద్ధత:- తన మన అనే భేదం లేకుండా స్వప్రయోజనాలను పక్కనపెట్టి తానా కి నిబద్ధతతో పనిచేయడం.