ఉత్తర అమెరికా తెలుగుసంఘం ‘తానా‘ మిడ్-అట్లాంటిక్ (TANA Mid-Atlantic Chapter) యువ వాలంటీర్లు ఒక అద్భుతమైన చరిత్రను సృష్టించారు. 8 వారాల పాటు ప్రాంతీయంగా నిర్వహించిన ఆహార సేకరణ కార్యక్రమంలో, 30కి పైగా పరిసర ప్రాంతాల నుండి 7,000 (3,200 కేజీలు) పౌండ్ల కంటే ఎక్కువ ఆహారాన్ని సేకరించి స్థానిక ఫుడ్ బ్యాంక్‌లకు విరాళంగా అందజేశారు.
ఈ అపూర్వమైన కార్యక్రమంలో 350 మందికి పైగా యువ వాలంటీర్లు (Young Volunteers) పాల్గొన్నారు. దీని ద్వారా 1,500 కంటే ఎక్కువ సర్టిఫైడ్ వాలంటీర్ సర్వీస్ అవర్స్ (Service Hours) నమోదయ్యాయి. తానా (TANA) చరిత్రలోనే కాకుండా, ఈ ప్రాంతంలోనే ఇది అతిపెద్ద యువ స్వచ్ఛంద కార్యక్రమాలలో ఒకటిగా నిలిచింది.
విరాళాల వివరాలు:
చెస్టర్ కౌంటీ ఫుడ్ బ్యాంక్‌కు 6,000 పౌండ్ల ఆహారం.
హారిస్‌బర్గ్ లోని న్యూ హోప్ మినిస్ట్రీస్‌కు 1,036 పౌండ్ల ఆహారం.
ఈ రికార్డు స్థాయి కార్యక్రమం తానా మిడ్-అట్లాంటిక్ (TANA Mid-Atlantic) యువత నాయకత్వ పటిమకు, అంకితభావానికి మరియు సేవా ధృక్పథానికి నిదర్శనంగా నిలిచింది. వీరికి అండగా నిలిచిన కుటుంబ సభ్యులకు, మార్గదర్శకులకు మరియు కమ్యూనిటీ నాయకులకు తానా పెద్దలు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ చారిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించిన కోర్ టీమ్ సభ్యులు: గోపి వాగ్వాల, వ్యోమ్ క్రోతపల్లి, సోహన్ సింగు, ధీరజ్ యలమంచి, క్రిషిత నందమూరి, అపర్ణా వాగ్వాల, సుజిత్ వాగ్వాల, ప్రణవ్ కంతేటి, లౌక్య పావులూరి, కేతన్ మామిడి, టియానా పటేల్, శ్రుతి కోగంటి, శ్రీకర్ కస్తూరి, మేధ యాగంటి, సితార నడింపల్లి, ఆర్నవ్ కంతేటి తోపాటు నైబర్‌హుడ్ కోఆర్డినేటర్లు ఉన్నారు.
తానా అధ్యక్షులు డాక్టర్ నరేన్ కొడాలి (Dr. Naren Kodali), బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి (Ravi Potluri), మిడ్-అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి (Phani Kantheti), బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, తానా కమ్యూనిటీ సర్వీసెస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని నేతృత్వంలో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది.
సతీష్ తుమ్మల (Satish Tummala), సునీల్ కోగంటి, సతీష్ చుండ్రు మరియు మిడ్-అట్లాంటిక్ (Telugu Association of North America Mid-Atlantic Chapter) బృందం మొత్తం కలిసికట్టుగా సేవా నిబద్ధతతో ఈ ఫుడ్ డ్రైవ్ (Food Drive) కార్యక్రమాన్ని విజయపథంలో నడిపించాయి.