Connect with us

Patriotism

Washington DC లో ఘనంగా 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

Published

on

Washington DC: అమెరికా రాజధాని ప్రాంతంలో తానా పాఠశాల (TANA School) ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని భాను మాగులూరి (Bhanu Maguluri) సమన్వయపరిచారు. భారతదేశ జాతీయ జెండాను, అమెరికా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.

మహాత్మాగాంధీ (Mahatma Gandhi), లాల్ బహుదూర్ శాస్త్రి (Lal Bahadur Shastri) చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముఖ్య అతిథిలుగా పాల్గొన్న ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్, మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. మన దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహనీయుల పోరాటాలు, త్యాగాలను నిరంతరం గుర్తుచేసుకోవాలన్నారు.

స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం, సామాజిక న్యాయం అనే పునాదులపై మన రాజ్యాంగాన్ని నిర్మించారన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య (Democracy) దేశాల్లో ముందు వరుసలో భారత్, తర్వాత అమెరికా నిలుస్తోందన్నారు. తెలుగు భాషకు, తెలుగుజాతికి తానా పాఠశాల చేస్తున్న సేవలను కొనియాడారు.

భాషే బంధానికి మూలం, సాంస్కృతికి వారసత్వ సంపదని అన్నారు. మాతృభాషను మరిచిన ఏ జాతి మనుగడ సాగించలేదన్నారు. అనంతరం కూన రవికుమార్ (Kuna Ravikumar) ను ఘనంగా సత్కరించారు. స్వీట్లు పంచి తమ ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో యాష్ బొద్దులూరి, రామ్ చౌదరి ఉప్పుటూరి, శ్రావ్య చామంతి, బోనాల రామకృష్ణ, రమేష్ అవిరినేని, గోన మోహనరావు మేకల సంతోష్ రెడ్డి, బండి సత్యబాబు, నంబూరి చంద్రనాథ్, వనమా లక్ష్మీనారాయణ, చల్లా సుబ్బారావు, వనమా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

error: NRI2NRI.COM copyright content is protected