తానా ఒహాయో వాలీ ఆధ్వర్యంలో కాళీ ప్రసాద్ మావులేటి అధ్యక్షతన కొలంబస్ లో మే 9, 2023 శనివారం నాడు కన్నుల పండుగగా తానా పాఠశాల కార్నివాల్ జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా తానా ప్రెసిడెంట్ నిరంజన్ శృంగవరపు, పాఠశాల చైర్ నాగరాజు నలజుల మరియు ఒహాయో సెనెటర్ నీరజ్ అంతాని విచ్చేశారు.
వీరు విద్యార్థినీ విద్యార్థులకు బహుమతులు, సర్టిఫికెట్స్ మరియు పాఠ్య పుస్తకాలు ప్రదానం చేశారు. తానా ఒహాయో వాలీ తరపున ఫౌండేషన్ ట్రస్టీ రవి సామినేని, ఒహాయో ఆర్ వి పి శివ చావా, వేణు చావా, చంద్ర రాయల, శ్యామ్ గద్దె, సిద్దు రేవూరి తదితరులు పాఠశాల అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియచేశారు.
హారిక బల్లెకారి వ్యాఖ్యాతగా వ్యవహిరించిన ఈ కార్యక్రమం పిల్లల ఆట పాటలతో ఆసాంతం ఆహ్లాదం గా కొనసాగింది. పాఠశాల కోచైర్ మరియు ఒహాయో ఏరియా డైరెక్టర్ కాళీ ప్రసాద్ కొలంబస్ పాఠశాల అభ్యున్నతికి కారణమైన సెంటర్ హెడ్ శ్రీనివాస్ పానుగంటి మరియు గురువులు కళ్యాణి మావులేటి, విశ్వేశ్వరి పిచిక, చంద్రిక నల్లమోతు, శర్వాని చలంచల, ఉమా కేసోజు, రాజి నాళం, సునీత పాలూరి, శ్రీలక్ష్మి యలవర్తి మరియు పూర్ణ ఇరుకులపాటి గార్లకు కృతజ్ఞతలు తెలియచేశారు.
ఈ తానా (Telugu Association of North America) పాఠశాల కార్నివాల్ కార్యక్రమానికి స్పాన్సర్స్ సాయి ఆర్ట్ గ్రూప్ దిశా శ్రీవాస్తవ మరియు రియల్టర్ రామ్ సానేపల్లి లకు ఆహుతులు ధన్యవాదాలు తెలపడంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.