Connect with us

Education

నార్త్ కేరొలీనా, క్యారీలో నాగ పంచుమర్తి అధ్యక్షతన తానా పాఠశాల సర్టిఫికెట్లు & పాఠ్య పుస్తకాల పంపిణీ

Published

on

డిసెంబర్ 4 ఆదివారం రోజున నార్త్ కేరొలీనా రాష్ట్రంలోని క్యారీ పట్టణంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం’ తానా’ పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. అలాగే పాఠశాల కోర్సు పూర్తి చేసిన చిన్నారులకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి తానా (Telugu Association of North America) అపలాచియన్ రీజినల్ కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి (Naga Panchumarthi) అధ్యక్షత వహించారు. పాఠశాల ఉపాధ్యాయురాలు అన్నపూర్ణ రూపాకుల ని శాలువాతో సత్కరించి మెమొంటో ప్రదానం చేయడం అభినందనీయం.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులను మరియు వారి తల్లిదండ్రులను తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు అభినందించారు. పాఠశాల కోసం వాలంటరీగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను వారి సేవలను పాఠశాల చైర్మన్ నాగరాజు నలజుల ఎంతగానో కొనియాడారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు తానా ద్వారా తమ పిల్లలు తెలుగు నేర్చుకోవడం, మాట్లాడడం తమకెంతో ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తానా ప్రాంతీయ సంచాలకులు శ్రీపాద కాసు, రామకృష్ణ అల్లు, రమేష్ తుమ్మలపల్లి మరియు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected