Connect with us

Schools

మినియాపోలిస్ లో మన్నవ సుబ్బారావు అతిథిగా తానా పాఠశాల విద్యార్థులకు సర్టిఫికెట్లు, పుస్తకాలు అందజేత

Published

on

అమెరికాలోని మినియాపోలిస్ నగరములో తానా (Telugu Association of North America) సంస్థ ఆధ్వర్యంలో తానా నార్త్ సెంట్రల్ రీజనల్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని అధ్యక్షతన తానా తెలుగు పాఠశాల పరీక్షలలో ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులకు సెప్టెంబర్ 17న సర్టిఫికెట్లు అందజేసి పుస్తకాలు పంపిణి చేశారు.

ఈ సందర్భంగా గుంటూరు మిర్చి యార్డ్ (Mirchi Yard) మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ భాష నాగరికతను నేర్పిస్తుంది, తెలుగు భాష తియ్యదనం, తెలుగుజాతి గొప్పతనాన్ని అమెరికాలో రుచి చూపించారన్నారు. భాషను భావితరాలకు అందజేసేందుకు తానా చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

భాషను చంపే తరంగా మనం మిగలకూడదు. కొన ఊపిరితో కొండెక్కుతున్న తెలుగు భాషను అమెరికాలోని తెలుగువారు బ్రతికిస్తున్నారు. ఏ జాతి అయితే తమ మాతృభాషను సంస్కృతి, సంప్రదాయాలు మరిచిపోతుందో ఆ జాతి అంతరించిపోతుంది. ఒక జాతి అస్థిత్వాన్ని ప్రత్యేకతను చాటి చెప్పేది మాతృభాషేనన్న విషయాన్నీ గుర్తించాలన్నారు.

తానా నార్త్ సెంట్రల్ రీజనల్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని (Sai Bollineni) మాట్లాడుతూ భాష ఒక సాంస్కృతిక వారధి. తరాల మధ్య అంతరం రాకుండా మాతృబాష కాపాడుతుందన్నారు. మాతృమూర్తిని, మాతృభాషను, మాతృదేశాన్ని మరువకూడదన్నారు. బాష మానవ సంబంధాలు పెంపొందించి సమాజాన్ని విడిపోకుండా కాపలా కాస్తుందన్నారు.

ఈ సందర్భముగా తానా నార్త్ సెంట్రల్ పాఠశాలకు ప్రోత్సాహం అందిస్తున్న తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి గారికి, తానా పాఠశాల చైర్ నాగరాజు నలజుల (Nagaraju Nalajula) గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తానా నార్త్ సెంట్రల్ పాఠశాల కోఆర్డినేటర్ మాలెంపాటి నాగరాజు, కెర్స్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ అరవపల్లి వేదవ్యాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected