Connect with us

Kids

మినియాపోలిస్ లో తెలుగు పిల్లల ఆట పాట: TANA North-Central Chapter

Published

on

తానా నార్త్ సెంట్రల్ టీం ఆధ్వర్యములో మిన్నియాపోలిస్ లో తానా తెలుగు కమ్యూనిటీ కార్యక్రమము తెలుగు పిల్లల ఆట-పాట ఘనంగా జరిగింది. తానా నార్త్ సెంట్రల్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని కార్యక్రమాన్ని నడిపించారు. ఈ కార్యక్రమములో 125 మందికి పైగా తెలుగు వారు పాల్గొని సరదా సరదాగా గడిపారు.

Recognizing the Kids in the Community కార్యక్రమములో భాగంగా Miss Tiny Minnesota Earth గా సెలెక్ట్ అయిన జాన్వీ ని మరియు Puzzle Solving లో అద్భుత ప్రతిభ కనపరుస్తున్న Rayirth Peteti ని అందరి సమక్షంలో అభినందనలు తెలిచేయటం జరిగింది. తానా నార్త్ సెంట్రల్ టీం తెలుగు పిల్లలు ఉన్నత శిఖరాలు చేరాలని కోరుకుంటూ వారిని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది.

తానా పాఠశాల ద్వారా తెలుగు నేర్చుకుంటూ తమ మొదటి సంవత్సరం విజయవంతముగా పూర్తి చేసిన కొంతమంది విద్యార్థులకు Certificates and Medals అందచేయటం జరిగింది. ఆట పాటలలో ఉత్సాహముగా పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసలు & మెడల్స్ అందచేయటం జరిగింది.

ఈ కార్క్యక్రమములో TANA తరుపున సాయి బొల్లినేని (Regional Coordinator), రామ్ వంకిన (Minneapolis Team Square Chair), వెంకట్ జువ్వ (Minneapolis Youth Leadership Promotion Chair), వేదవ్యాస్ అర్వపల్లి (Minneapolis TANA Cares Chair), నాగరాజు మాలెంపాటి (Paatasaala Chair), సురేష్ బొర్రా (Paatasaala CoChair) పాల్గొన్నారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected