తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా న్యూయార్క్ టీమ్ (TANA New York Chapter) ఆధ్వర్యంలో ఆదివారం, డిసెంబర్ 21న రెండు ముఖ్యమైన సామాజిక సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాలు మన సమాజాన్ని ఒక్కటిగా చేసి, అవసరంలో ఉన్నవారికి సేవ చేయడానికి ఒక మంచి అవకాశంగా నిలిచాయి.
TANA ఫుడ్ డ్రైవ్ (Food Drive) కార్యక్రమం ద్వారా సుమారు 750 పౌండ్ల ఆహార సామగ్రిని సఫోక్ వై జెసిసి కమ్యూనిటీ ఫుడ్ ప్యాంట్రీ, కమాక్, న్యూయార్క్ (New York) కు విరాళంగా అందజేయడం జరిగింది. ఇది ఆహార కొరతతో బాధపడుతున్న స్థానిక కుటుంబాలకు ఎంతో మేలు చేసింది.
అదేవిధంగా, వెటరన్స్ ఆఫ్ ఫారిన్ వార్స్ (VFW), వీట్‌లీ హైట్స్, న్యూయార్క్ (New York) లో సైనికుల పిల్లల కోసం ఆహారం, బొమ్మలు మరియు పాఠశాల సరుకుల పంపిణీ కార్యక్రమంను తానా నిర్వహించింది. ఈ కార్యక్రమం ద్వారా సైనిక కుటుంబాల్లో ఆనందం మరియు ఉత్సాహం నింపబడింది.
ఈ రెండు కార్యక్రమాలు TANA అధ్యక్షులు నరేన్ కొడాలి (Dr. Naren Kodali) గారి నాయకత్వంలో, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని (Sai Bollineni) మరియు స్పెషల్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి (Naga Panchumarthi) గార్ల సహకారంతో నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమాలను TANA న్యూయార్క్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు (Srinivas Bharthavarapu) సమర్థవంతంగా సమన్వయం చేయగా, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లుగా దిలీప్ ముసునూరు (Dilip Musunuru), ప్రసాద్ కోయి, సుచరిత అనంతనేని, రజిత కల్లూరి, జితేంద్ర యార్లగడ్డ, శ్రీనివాస్ నాదెళ్ళ, రాజేశ్ కడియాల, మరియు కలీమ్ మహమ్మద్ గారు సేవలందించారు.
ఈ కార్యక్రమాల విజయానికి ముఖ్య కారణమైన మన యువ వాలంటీర్లకు (Youth Volunteers) ప్రత్యేక కృతజ్ఞతలు: ఆశ్రిత కోయి, శరణ్ సాయి భర్తవరపు, గీతిక చల్లా, రజిత్ రెడ్డి, రమ్య రెడ్డి, లోహితాక్ష్ సాయి నాదెళ్ల , విష్ణు సాయి ఆశ్రిత్ రాచకుంట, సుధీక్ష ముసునూరు, సుహాస్ ముసునూరు, సమన్విత మిన్నెకంటి, ఆరిజ్ మహమ్మద్ మరియు ఐరా మహమ్మద్.
ఫుడ్ గివ్అవే కార్యక్రమానికి ప్రధాన సహకారం అందించిన కమ్యూనిటీ లీడర్ ప్రసాద్ కంభంపాటి గారికి, అలాగే పాల్గొని మద్దతు అందించిన శిరీష తూనుగుంట్ల (Sirisha Tunuguntla) మరియు సైలజ చల్లపల్లి గార్లకు తానా (TANA) హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తోంది.
సఫోక్ వై జెసిసి ఫుడ్ ప్యాంట్రీ సిబ్బంది మరియు వాలంటీర్లు, అలాగే VFW సైనికులు మరియు వారి పిల్లలు, తమ సమాజానికి అండగా నిలిచిన తానాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సమాజ సేవే లక్ష్యంగా, అందరం కలిసి ముందుకు సాగుతూ, సార్థకమైన మార్పును తీసుకురావడానికి తానా (TANA) ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది.