Connect with us

Patriotism

న్యూ యార్క్ వీధుల్లో రెపరెపలాడిన మువ్వన్నెల జండా: TANA @ India Day Parade

Published

on

కోట్ల మంది త్యాగ ఫలితం భారత దేశం (India) స్వాతంత్రం, తరతరాల యమ యాతన అంతం ఆగస్టు 15, కోట్ల మంది అంతు లేని అవధులు లేని సంతోషం ఆగష్టు 15, భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భముగా ప్రపంచ వ్యాప్తముగా మువ్వన్నెల భారతదేశ జండా ఆగస్టు 15 న గగన వీధుల్లో రెప రెప లాడింది.

భారతదేశ (India) 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రపంచములో అతి పెద్దయిన న్యూ యార్క్ (New York) ఇండియా పరేడ్ అని అందరకి తెలిసిన విషయం. ఈ ఏడాది పరేడ్ కి భారత దేశ తారలు విజయ్ దేవకొండ (Vijay Devarakonda), రష్మిక (Rashmika Mandanna) ఈ వేడుకకు హాజరయ్యారు. మండు టెండలో నవ్వుతు అందరకి అభి వాదము చేశారు.

ఉత్సాహభరితమైన ప్రదర్శనలు, సాంప్రదాయ ప్రదర్శనలు మరియు రంగురంగుల ఫ్లోట్‌ల ద్వారా భారతదేశ (India) గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించిన ఈ కవాతులో వేలాది మంది ప్రజలు వీధుల్లోకి తరలివచ్చారు. అలాగే ఉత్సాహంగా ప్రదర్శనలు ఇచ్చారు.

ప్రపంచములో అతి పెద్దయిన న్యూ యార్క్ ఇండియా పరేడ్ (New York India Parade) వేడుకలో భాగంగా, తెలుగు అస్సోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) పాల్గొంది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) సమాజానికి “జీరో ప్లాస్టిక్” సందేశాన్ని కనుబరిచింది. సభ్యులు గర్వంగా మరియు ఉత్సాహంగా జెండాలను ఊపుతూ 85 డిగ్రీల వేడిలో రెండు మైళ్లదూరం నడిచారు.

వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ, ఎవరూ అలసట సంకేతాలను చూపించలేదు. వారి స్ఫూర్తి మరియు అంకితభావం సమాజం మరియు మాతృభూమి పట్ల వారి ప్రేమను ప్రతిబింబించాయి. 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ని చూడగానే జనసందోహం తమ ఆనందాన్ని అభివాదం తోటి చేతులు వూపుతూ కనబరిచారు.

ప్రపంచములో అతి పెద్దయిన న్యూ యార్క్ ఇండియా పెరేడ్ లో పాలుగొన్న ప్రతి ఒక్కరికి న్యూయార్క్ (New York) రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ భర్తవరపు, న్యూ జెర్సీ రీజినల్ కోఆర్డినేటర్ సుధీర్ చంద్ నారెపలేపు, న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కోఆర్డినేటర్ మౌనిక మణికొండ, ఏంతో దూరమునుండి వచ్చిన అందరకి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.

ఇంకా చేయబోయే ఎన్నో తానా సేవ కార్య క్రామాలు గూర్చి విశదీకరించారు. సంబరాలు అనంతరము, తానా ఫౌండేషన్ (TANA Foundation) ట్రస్టీ శ్రీనివాస్ ఓరుగంటి, సతీష్ మేక ముందు తరానికి ప్రేరేపనించే కార్యక్రమాలు గూర్చి భారతదేశములో, అమెరికాలో చేయాలిసినా అందరకి అవసరమైన చోట ఆసరా వి విధానమైన కార్యక్రమాలు గూర్చి చర్చించారు.

తానా (Telugu Association of North America – TANA) స్పెషల్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి ఆడంబరానికి పోకుండా దాత లు ఇచ్చే ప్రతి పైసా ప్రాజెక్టులకు నిస్వార్ధముగా వినియోగిస్తున్నామని విన్నవించారు. తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్, అమెరికన్ స్కూల్ కమిటి సభ్యులు కృష్ణ ప్రసాద్ సోంపల్లి (Krishna Prasad Sompally) ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కి కేవలం పాల్గొనుటయే కాకుండా మన సమాజానికి స్ఫూర్తి నిచ్చే సమర్థవంతమైన ప్రదర్శన దాని ప్రాముఖ్యము గూర్చి విడమర్చి చెప్పారు.

error: NRI2NRI.COM copyright content is protected