Connect with us

Immigration

221g అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ డిలేపై తానా ఇమ్మిగ్రేషన్ సెమినార్ సెప్టెంబర్ 22న

Published

on

ఇండియా నుండి అమెరికా వలస వచ్చిన వారికి ఇమ్మిగ్రేషన్ (Immigration) కష్టాలు బాగా తెలుసు. మరీ ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవాళ్ళ H1B వీసా (Visa) కష్టాలు వర్ణనాతీతం. ఎందుకంటే అమెరికాలో వీసాకి దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి ఇండియా వెళ్ళినప్పుడు స్టాంపింగ్ అయ్యేవరకు దినదిన గండమే. ఎప్పుడు ఏ రూల్స్ మారుస్తారో, ఏ ప్రశ్నలు అడుగుతారో ఆ దేవుడికే ఎరుక. వీసా స్టాంపింగ్ కి వెళ్లిన వారు అలాంటి క్లిష్టమైన పరిస్తుతులే ఎదుర్కొంటున్నారు. దాని పేరే 221g.

ఈ 221g లో మళ్ళీ వైట్ స్లిప్, బ్లూ స్లిప్, గ్రీన్ స్లిప్ మరియు యెల్లో స్లిప్ అంటూ నానా రకాలు. అడిషనల్ ప్రాసెసింగ్ చెయ్యాలి, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటూ అమెరికా కాన్సులేట్లు 221g ఇవ్వడంతో కొన్ని నెలలపాటు అమెరికా బయట ఇండియా తదితర దేశాల్లో ఇరుక్కుపోతున్నారు.

ఇలాంటి వారికోసం తానా (TANA) వారు ఇమ్మిగ్రేషన్ సెమినార్ నిర్వహిస్తున్నారు. అమెరికాలో భారతీయులకు ముఖ్యంగా తెలుగువారికి తోడుగా నిలిచే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ‘తానా’ ప్రస్తుతం నీడ్ ఆఫ్ ది అవర్ 221g ప్రాసెసింగ్ ఆలస్యం అవడానికి సంబంధించిన విషయాలపై ప్రముఖ ఇమ్మిగ్రేషన్ లాయర్ జానాథన్ వాస్డెన్ తో ఈ సెమినార్ నిర్వహిస్తున్నారు.

వచ్చే గురువారం, సెప్టెంబర్ 22 రాత్రి 9 గంటలకు (Eastern Standard Time) తానా కోశాధికారి అశోక్ బాబు కొల్లా (Ashok Babu Kolla) మరియు తానా సహాయ కార్యదర్శి మురళి తాళ్లూరి (Murali Talluri) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సెమినార్ రెజిస్ట్రేషన్ వివరాలకు https://tana.org/immihelp ని సందర్శించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected