ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ‘తానా’ ఫౌండేషన్ మరియు శంకర్ ఐ ఫౌండేషన్ (Sankar Eye Foundation) సంయుక్తంగా ఏప్రిల్ 9వ తేదీ ఆదివారం రోజున ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు.
సుమారు నాలుగు వందల మందికి పైగా నేత్ర పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళ జోళ్ళు అందించారు. అలాగే డెబ్భై అయిదు మందికి కంటి ఆపరేషన్ అవసరమని గుర్తించారు. ఈ నేత్ర వైద్య శిబిరంనికి హాజరైన గ్రామస్తులు తానా (TANA) చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు.
ఈ నేత్ర వైద్య శిబిరం దుగ్గిరాల చిన్నబ్బాయి మరియు శ్రీమతమ్మ జ్ఞాపకార్థం శిరీష యలమంచిలి కోల స్పాన్సర్ చేశారు. తానా (Telugu Association of North America) ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి గుడే ఈ నేత్ర వైద్య శిబిరానికి సమన్వయ కర్తగా వ్యవహరించారు.
తానా (TANA) తరపున అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, తానా ఫౌండేషన్ ట్రస్టీ మరియు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పురుషోత్తమ చౌదరి గుడే లను అంగలూరు గ్రామస్తులు అభినందించారు.