Connect with us

Eye Camp

కృష్ణా జిల్లా గొడవర్రులో తానా ఉచిత కంటి శిబిరం విజయవంతం

Published

on

ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, కంకిపాడు మండలం, గొడవర్రు గ్రామం నందు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఫౌండేషన్ మరియు విజయవాడ రోటరీ హాస్పిటల్ సంయక్తముగా మే 28వ తేదీన ఉచిత మెగా కంటి శిబిరం నిర్వహించారు. విజయవంతంగా పూర్తి అయిన ఈ ఉచిత మెగా కంటి శిబిరంలో సుమారు మూడు వందల మందికి పైగా పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళ జోళ్ళు అందించారు.

స్థానిక ప్రాధమిక పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన గొడవర్రు గ్రామ పెద్దలు తానా చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ ఉచిత మెగా కంటి శిబిరం కార్యక్రమానికి హరికృష్ణ గుళ్ళపల్లి స్పాన్సర్ చెయ్యడం జరిగినది. తానా ఫౌండేషన్ ట్రస్టీ పురుషోత్తమ చౌదరి గుడే ఈ ప్రాజెక్ట్ కి సమన్వయకర్తగా వ్యవహరించారు.

error: NRI2NRI.COM copyright content is protected