ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని ఎన్టీఆర్ జిల్లా, వత్సవాయి మండలం, పోలంపల్లి గ్రామం నందు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ మరియు ఉయ్యూరు రోటరీ కంటి ఆసుపత్రి సంయక్తంగా ఏప్రిల్ 2వ తేదీ ఆదివారం రోజున ఉచిత మెగా కంటి శిబిరం నిర్వహించారు.
ఈ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ఉచిత మెగా కంటి శిబిరంలో సుమారు మూడు వందల మందికి పైగా పాల్గొనగా విజయవంతంగా పూర్తి అయింది. పాల్గొన్న వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన 176 మందికి ఉచితంగా కళ్ళ జోళ్ళు అందించారు.
అలాగే 63 మందికి క్యాటరాక్ట్ ఆపరేషన్ (Cataract Surgery) అవసరమని గుర్తించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పోలంపల్లి గ్రామ పెద్దలు తానా (TANA) చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఈ ఉచిత మెగా కంటి శిబిరానికి న్యూయార్క్ వాసి రంజిత్ క్యాతం (Ranjeet Kyatham) స్పాన్సర్ చేశారు.
తానా (TANA) ఫౌండేషన్ ట్రస్టీ మరియు తానా కంటి శిబిరాల సమన్వయకర్త సుమంత్ రాంశెట్టి (Sumanth Ramsetti) ఈ ప్రాజెక్ట్ ని సమన్వయపరిచారు. ఈ సందర్భంగా ఉయ్యూరు రోటరీ కంటి ఆసుపత్రి ఛైర్మన్, హాస్పిటల్ సిబ్బంది మరియు స్పాన్సర్ రంజిత్ క్యాతం కి సుమంత్ ధన్యవాదాలు తెలిపారు.
తానా (TANA) తరపున అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ, తానా ఫౌండేషన్ ట్రస్టీ & ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సుమంత్ రాంశెట్టి లను పోలంపల్లి గ్రామస్తులు అభినందించారు.
బధరి కురివెళ్ల, లక్ష్మీనారాయణ కురివెళ్ల మరియు వారి కుటుంబ సభ్యులు పోలంపల్లినోని తమ స్వగృహంలో ఈ తానా ఉచిత మెగా కంటి శిబిరం (TANA Mega Eye Camp) నిర్వహించడం అభినందనీయం.