ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా చేయూత’ పథకం ద్వారా మరోసారి పేద విద్యార్థులకు అపన్న హస్తం అందించారు. తానా ఫౌండేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి, ఐశ్వర్య శ్యామ్‌రాజ్ సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ లో సుమారు 80 మందికి పైగా పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేశారు.
ఈ నెల 20న జరిగిన కార్యక్రమంలో స్కాలర్‌షిప్‌లు అందుకున్న వారిలో డిగ్రీ విద్యార్థులు ఉన్నారు. మొత్తం 83 మంది విద్యార్థుల్లో 45 మందికి గత మూడేళ్లుగా స్కాలర్‌షిప్‌ల పంపిణీ జరుగుతోంది. వీరిని కూడా మరోసారి ఎంపిక చేసి స్కాలర్‌షిప్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పడాల ట్రస్ట్ చైర్మన్ సూర్య పడాల మాట్లాడుతూ తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తానా ఫౌండేషన్ కార్యదర్శి శశికాంత్ వల్లేపల్లి, ఐశ్వర్య శ్యామ్‌రాజ్, పడాల ట్రస్ట్ వారిని అందరూ అభినందించారు.